దేవుడికి నైవేద్యం మర్పించేటప్పుడు పరదా ఎందుకు వేస్తారో తెలుసా?
TeluguStop.com
మన హిందూ సంప్రదాయాల ప్రకారం పెద్దలు చేసే ప్రతీ వెనుక ఒక పరమార్థం ఉంటుంది.
మనం పాటించే పద్ధతులు, ఆచార, సంప్రదాయాలన్నీ మనకు ఆరోగ్యంతో పాటు ఆనందాన్ని కల్గించేవే.
అయితే మనం పెద్దలు చెప్తే వినమనే భావనతో కొన్ని దేవుడి పేరు చెప్పి చేయిస్తారు.
అలా కొంచెం భయంతోనైనా మనం సక్రమ మార్గంలో నడుస్తామని వారి భావన.ఇదంతా ఇలా ఉండే.
మనం గుడికి వెళ్లినప్పుడు కాళ్లు కడుక్కోవడం, మొక్కులు చెల్లించుకోవడం వంటివి చేస్తుంటాం.అంతే కాదు పూజలు, వ్రతాలు, హారతి వంటివి జరిగేటప్పుడు కళ్లార్పకుండా చూస్తాం.
అయితే ఆ సమయంలో దేవుడికి నైవేద్యం సమర్పించేటప్పుడు మాత్రం మనకు కన్పించకుండా పరదా వేస్తారు.
అసలు అలా ఎందుకు వేస్తారు, అలా వేయడం వెనుక గల కారణం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఆలయాల్లో అర్చన సమయంలో జరిగే షఓడశ ఉపచారాల్లో నివేదన ఒకటి.మిగిలిన అన్ని సేవలనూ భక్తులు చూడవచ్చు.
చూసి తరించవచ్చు.కానీ నివేదన చేసే వేళ మాత్రం దృష్టి దోషం రాకుండా ఉండాలని ఆగమ సంప్రదాయం.
పెద్దలు, పసి పిల్లలు భోజనం చేసే సమయాల్లో మన ఇళ్లలో కూడా ఇలాంటి విధానం పాటించడం మనం గమనించవచ్చు.
దేవుడికి నివేదన చేసిన పదార్థం ప్రసాదం అవుతుంది.అందుకు నివేదన సమయంలో దృష్టి దోష పరిహారారాథం తెర కట్టడం ఆగమ సంప్రదాయం.
అందుకే నివేదన సమయంలో చాలా గుడుల్లో పరదా కడుతుంటారు.అంతే కాదు అమ్మవారిని అలంకరించేటప్పుడు కూడా తెర వేస్తూ ఉంటారు.
వేసవిలో డీహైడ్రేషన్ నుంచి రక్షించే సూపర్ డ్రింక్ ఇది..!