తెలంగాణా నాయకులు ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్‌తో ఎందుకు పోలుస్తారు?

రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు గడిచినా తెలంగాణకు, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య అప్పుడప్పుడ మాటల యుద్దం కొనసాగుతునే ఉంది.

తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తుంటే, ఆంధ్రప్రదేశ్ మాత్రం ఆశాజనకంగా లేదు.అభివృద్ధిని మరచి అక్కడి ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లించలేకపోతోందంటూ తరుచూ విమర్శలు వినిపిస్తున్నాయి.

పొరుగు తెలుగు రాష్ట్రంతో పోలిస్తూ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతోందో తెలంగాణ నేతలు ఎప్పటికప్పుడు ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

అంతకుముందు ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ల దుస్థితి, కరెంటు కోతలతో ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారని పరోక్షంగా కేటీఆర్ అన్నారు.

ఇది అనేక విమర్శలకు దారి తీసింది.తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఉపాధ్యాయులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఆరోపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు.

అక్కడున్న ఉపాధ్యాయులను ఉద్దేశించి హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోలికను చూపుతూ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఏవిధంగా మేలు చేస్తుందో హరీశ్ రావు ఎత్తిచూపారు.

గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు 73 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చామని మంత్రి తెలిపారు.

అంతకుముందు క్రెడాయి ఈవెంట్‌లో ఏపీపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.అక్కడ రియల్ ఎస్టెట్ పడిపోయిందని అది తెలంగాణకు లభించదని అన్నారు.

"""/" / తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని ఎవరికీ అర్థం కావడం లేదు.

దీనికి వెనుక మాస్టర్ ప్లాన్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.భౌగోళికంగా రాష్ట్రాలు వీడిపోయిన కూడా ప్రజల మధ్య సత్ససంబంధాలు కొనసాగుతున్నాయి.

చాలా మంది ఏపీ ప్రజలు తెలంగాణలో నివస్తున్నారు.ఇక మీడియా సంస్థలు కూడా ఉమ్మడిగానే రెండు తెలుగు రాష్ట్ర వార్తలు కవర్ చేస్తున్నాయి.

ఏపీ విమర్శలు చేయడం వల్ల అది తొందరగా ప్రజలకు చేరుతుందని.అలాగే మీడియా కూడా ఆ వార్తలు ప్రాధన్యత ఇస్తుందని నేతలు భావిస్తున్నారు.

ఈ విమర్శలపై ఆంద్ర నేతలు అంతా ఘాటుగా స్పందించారని వారి భావన. .

MLA Danam Nagendar : ఎమ్మెల్యే దానంపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ