నారప్ప సినిమా మళ్లి రిలీజ్... సురేష్ బాబు అసలు వ్యూహం ఏమై ఉంటుందబ్బా ?
TeluguStop.com
డిసెంబర్ 13 .హీరో వెంకటేష్ పుట్టిన రోజు.
ఆ సందర్భాన్ని ఆసరా చేసుకొని అయన ఆ మధ్య లాక్ డౌన్ లో నటించిన నారప్ప సినిమాను థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు.
అలాగే ఈ సినిమా కి చెందిన ఒక్క రోజు కలెక్షన్స్ చారిటీ కోసం వాడతారట.
ఈ మాట వినగానే ఇండస్ట్రీ లో చాల మంది నవ్వి ఉంటారు.ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెద్ద ఫ్యామిలీలకు అసలు చారిటీ అంటే ఏంటో తెలుసా అని వారి మెదళ్లను తొలిచే ప్రశ్న అధ్యక్షా.
"""/"/
అందులో ముఖ్యంగా దగ్గుబాటి కుటుంబం ఏ రోజైన పొరపాటున కూడా చారిటీ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో ఎక్కడైనా చూసారా ? ఒక రాజమౌళి, ఒక దిల్ రాజు, ఒక దగ్గుబాటి .
వీళ్లల్లో ఎవరైనా పిల్లకి బిక్షం పెడతారా ? ఈ నారప్ప సినిమా లాక్ డౌన్ లో జనాలు సినిమా థియేటర్లకు రాలేరు కాబట్టి నేరుగా ఓటిటి లో వేశారు.
అక్కడ మంచి పాజిటివ్ టాక్ వచ్చింది.దాంతో ఉన్నపళంగా అన్ని థియేటర్స్ ని సిండికేట్ గా సురేష్ బాబు మాట్లాడేసుకొని నారప్ప సినిమాను థియేటర్లలో వేసి సొమ్ము చేసుకునే ప్రోగ్రాం ప్లాన్ చేసారు.
దానికి పైగా చారిటి అనే పేరు పెట్టారు.పోనీ ఈ సంస్థ ద్వారా చారిటీ ప్రోగ్రామ్స్ చేయబోతున్నారు అనే క్లారిటీ ఇవ్వలేదు.
పైగా వీరికి ఎలాంటి సొంత చారిటి ఉన్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. """/"/
ఇక సురేష్ బాబు తండ్రి రామానాయుడు మాత్రం ప్రభుత్వం దగ్గర చవకగా తీసుకున్న గవర్నమెంట్ స్థలాల్లో స్టూడియోలు కట్టి బాగానే సొమ్ము చేసుకున్నారు.
సురేష్ బాబు కూడా ఏమి తక్కువ తినలేదు.తండ్రి నుంచి వారసత్వం గా సినిమా ఎలా తీయాలో పుణికి పుచ్చుకున్నాడు.
మొన్న ఆ మధ్య బాలయ్య బాబు తో షో లో కూడా తన తమ్ముడితోనే ఎక్కువ సినిమాలు చేశాను పైగా డబ్బులు మాత్రం సగమే ఇస్తాను అని చెప్పాడు.
ఇక్కడ తమ్ముడికన్నా కూడా డబ్బు ఎలా సేవ్ చేయాలో అయన మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు.
పెద్ద ప్రొడక్షన్ కంపెనీ లు కార్పొరేట్ కంపెనీ లాగానే పరిగణించాలి.వారి నుంచి కూడా 2 శాతం CSR ఫండ్ వసూల్ చేయాలి.
అవి కూడా చాల మంది దొంగ లెక్కలే చూపిస్తున్నారు.
పుష్ప2 మూవీకి దేవిశ్రీని తప్పించడానికి మరో డైరెక్టర్ కారణమా.. అసలు ట్విస్ట్ ఇదేనా?