నేను అందుకే హీరో కాలేకపోయాను - సురేష్ బాబు

నేను అందుకే హీరో కాలేకపోయాను – సురేష్ బాబు

దగ్గుబాటి సురేష్ బాబు.టాలీవుడ్ టాప్ నిర్మాత.

నేను అందుకే హీరో కాలేకపోయాను – సురేష్ బాబు

తెలుగుతో పాటు పలు భాషల్లోనూ ఆయన నిర్మాతగా కొనసాగిస్తున్నారు.మూవీ మొఘల్, దిగ్గజన నిర్మాత అయిన తన తండ్రి రామానాయుడు వారసత్వాన్ని కొనసాగిస్తూ.

నేను అందుకే హీరో కాలేకపోయాను – సురేష్ బాబు

ఆయన మాదిరిగానే అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నాడు.చిన్న సినిమాలతో పాటు పెద్ద సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా ముందుకు సాగుతున్నాడు.

తన తమ్ముడు వెంకటేష్.టాలీవుడ్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.

అద్భుత సినిమాల్లో నటించి టాలీవుడ్ టాప్ హీరోగా దిగాడు.సురేష్ బాబు మాత్రం తన తండ్రి బాటలోనే నడిచాడు.

ఆయన వ్యాపారాలను కొనసాగించాడు.తండ్రి స్థాపించిన సురేష్ ప్రొడక్షన్ సంస్థని మరింతగా ఆధునీకరించాడు.

ఈ సంస్థను కేవలం నిర్మాణ సంస్థలాగే ఉంచకుండా.థియేటర్లను నిర్మించిచేలా చేశాడు.

డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా మార్చాడు.మొత్తంగా సురేష్ ప్రొడక్షన్స్ బ్రాండ్ ను అమాంతం పెరిగేలా చేశాడు.

సురేష్ బాబుకు కెరీర్ తొలినాళ్లలో సినిమా హీరోగా అవకాశాలు వచ్చాయి.కానీ తనకు నటన పట్ల అంతగా ఆసక్తి లేకపోవడంతో వద్దని చెప్పినట్లు వెల్లడించాడు.

తాజాగా ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. """/"/ సురేష్ బాబు యంగ్ ఏజ్ లో ఉన్న సమయంలో కమల్ హాసన్ మారిదిగా ఉండేవాడు.

అంతేకాదు.అప్పట్లో కమల్ హాసన మాదిరిగానే ఉండే కారును తను కూడా వాడేవాడు.

అందుకే సురేష్ బాబు ఎక్కడికి వెళ్లినా కమల్ హాసన్ వచ్చినట్లు జనాలు భావించేవారట.

ప్రముఖ దర్శకుడు భారతీరాజా తనతో ఓ సినిమా చేసేందుకు ముందుకు వచ్చినట్లు సురేష్ బాబు చెప్పాడు.

"""/"/ తనకు సినిమాల్లో యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అప్పట్లో లేదని వెల్లడించాడు.

అందుకే ఆయన ఆఫర్ ను తిరస్కరించినట్లు వెల్లడించాడు.తొలినాళ్ల నుంచి తన ఆలోచనలన్నీ వ్యాపారాల గురించే గురించే ఉండేదని చెప్పాడు.

అందుకే సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది కాదని చెప్పాడు.భారతీరాజా ఒక్కడే కాదు.

పలువురు దర్శకులు తనతో సినిమాలు చేయాలని భావించినా.తాను వద్దని వారించినట్లు వెల్లడించాడు.