పాపం సుప్రియ..ఎందుకు అందరికీ ఆమె మాత్రమే టార్గెట్

సుప్రియ.అన్నపూర్ణ స్టూడియో ని ఒంటి చేత్తో నడిపిస్తున్న అక్కినేని నాగార్జున కోడలు.

అక్కినేని నాగేశ్వరరావు కూతురి కి కూతురు.ఒంటరిగా నివసిస్తుంది తల్లి లేదు భర్త కూడా చనిపోయాడు.

ఒక టీనేజ్ కుమార్తె కూడా ఉంది.ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది కానీ ఎందుకో ఏమో తెలియదు కానీ నిత్యం వార్తల్లో ఉంటుంది సుప్రియ.

అలా అని ఆమె కాంట్రవర్సీలు మాట్లాడే టైపు కాదు.కాంట్రవర్సీలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకు ఎప్పుడు వార్తల్లో ఉంటుంది సుప్రియ అనే ప్రశ్నకు సమాధానం కూడా లేదు.

మరి సుప్రియ పై వార్తలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి యూట్యూబ్లో అడ్డగోలుగా సుప్రియను ఎందుకు మసాలా కంటెంట్ గా వాడుకుంటున్నారు అంటే నిజంగా సమాధానం లేదు.

చైతన్య, సమంత విడాకులు తీసుకుని ఎవరి జీవితాల్లో వారు బాగానే ఉన్నారు.వీరిద్దరి మధ్య గొడవకు సుప్రియ కారణం అంటూ కూడా యూట్యూబ్లో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.

అడవి శేషు తో సుప్రియ పీకల్లోతు ప్రేమలో ఉందని ఇద్దరు సహజీవనం కూడా చేస్తున్నారని మీరు పెళ్లికి అక్కినేని సమంత ఒప్పుకోకపోవడంతోనే సమంతకి, నాగచైతన్యకి గొడవలు మొదలయ్యాయని ఈ క్రమంలోనే విడాకులు కూడా జరిగాయని వార్తలు పుట్టుకొచ్చాయి.

ఇలాంటి లాజిక్ లేని వార్తలు ఎలా వస్తాయో ఆ దేవుడికే తెలియాలి.సమంత సుప్రియ పెళ్ళికి అడ్డుపడటం అనేది ఒక సిల్లీ వార్త.

పెళ్లి చేసుకోవాలంటే నాగార్జున ఒక్కడూ ఒప్పుకుంటే చాలు ఇక ఎవరితోనూ పనిలేదు అలాంటి సమయంలో సమంత తన జీవితాన్ని పాడు చేసుకుని మరి సుప్రియకు అడ్డుగా నిలుస్తుందా అంటే అది కూడా లాజిక్ లేకుండా ఉంది.

"""/"/ ఇక ఇలా లాజిక్ లేని కాంట్రవర్సీలు సుప్రియ విషయంలో రావడం ఇదేమి కొత్త కాదు.

ఆ మధ్యకాలంలో అన్నపూర్ణ స్టూడియో ని సుప్రియ దగ్గర నాశనం చేస్తుంది అన్నట్టుగా వార్తలు రాశారు.

ఇక ఆ తర్వాత సుమంత్ కీర్తి రెడ్డి విడిపోవడానికి సుప్రియనే కారణమంటూ ముద్రవేశారు.

తన తల్లి చనిపోయి భర్త చనిపోయి ఒంటరిగా ఉన్న మహిళపై ఇలా లేనిపోని వార్తలు రాయడం ఎంతవరకు సబబు అని అక్కినేని అభిమానులు వాపోతున్నారు.

మయన్మార్‌లో సంస్కృతంలో బోధన .. రాజస్థాన్‌ ఎన్ఆర్ఐకి ‘ప్రవాసీ భారతీయ సమ్మాన్’