కొడుకు కోసం కోర్టు మెట్లు ఎక్కిన సూపర్ స్టార్ కృష్ణ.. కానీ?
TeluguStop.com
టాలీవుడ్ హీరోలు( Tollywood Heroes ) తమ వారసులను సినిమా రంగంలోకి తీసుకురావడం కామన్.
బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, నందమూరి కళ్యాణ చక్రవర్తి, రమేష్ బాబు అలా వచ్చినవారే.
వీరిలో స్టార్ హీరోలుగా కొందరు సెటిలైతే మరికొంతమంది ఫెడవుట్ అయిపోయారు.అప్పట్లో సూపర్‌స్టార్ కృష్ణ( Superstar Krishna )
) తన పెద్ద కుమారుడు రమేష్‌బాబుని హీరోగా నిలబెట్టేందుకు చాలా ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో బాలకృష్ణ సినిమాతో ఒక వివాదం కూడా తలెత్తింది.దీనివల్ల కృష్ణ కోర్టు మెట్లు కూడా ఎక్కారు.
చివరికి ఏ వివాదంలో ఆయనే గెలిచారు.ఈ గొడవకు ముందు కృష్ణ తన పెద్ద కుమారుడిని హీరోగా చూడాలని ఎంతో కలలు కన్నారు.
అందుకే రమేష్‌కి( Ramesh ) నటన, డాన్సు, ఫైట్స్ నేర్పించారు.ఆపై తెలుగు తెరకు ఇంట్రడ్యూస్ చేశారు.
బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘బేతాబ్’కు( Betab ) తెలుగు రీమేక్ రైట్స్ కొనుగోలు చేసి పరుచూరి బ్రదర్స్‌తో కథను తెలుగు నేటివిటికి తగ్గట్టు రాయించుకున్నారు.
బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ బప్పిలహిరి చేత సాంగ్స్ కంపోజ్ చేయించారు.ఫిమేల్ లీడ్‌గా హిందీ యాక్ట్రెస్ సోనమ్‌ను సెలెక్ట్ చేసుకున్నారు.
ఇదే రమేష్‌కు ఫస్ట్ సినిమా కాబట్టి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు.పద్మాలయా స్టూడియోస్ బేనర్‌లోనే మూవీని స్టార్ట్ చేశారు.
దీనికి ‘సామ్రాట్’ అనే టైటిల్ పెట్టాలని డిసైడ్ అయ్యారు.అయితే ఈ సమయం నాటికే ఎన్టీఆర్, కృష్ణల మధ్య సంబంధాలు తెగిపోయాయి.
'దేవుడు చేసిన మనుషులు’ సినిమా ( Devudu Chesina Manushulu )టైమ్‌లో వచ్చిన విభేదాల కారణంగా వీళ్లు మాట్లాడుకోవడం మానేశారు.
అందువల్ల రమేష్‌బాబు ఫస్ట్ మూవీ లాంచ్‌కు ఎన్టీఆర్‌ను కాకుండా అక్కినేని నాగేశ్వరరావుని పిలిచారు.
మరోవైపు బాలకృష్ణ అప్పటికే ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.కృష్ణ బాలయ్యను తొక్కేయడానికే రమేష్‌బాబును సినిమాల్లోకి తీసుకొస్తున్నారని అప్పట్లో గుసగుసలు కూడా వినిపించాయి.
రమేష్ ఫస్ట్ మూవీ మద్రాస్‌లోని ఏవీఎమ్ స్టూడియోలో స్టార్ట్ అయింది.ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను కన్నడ దర్శకుడు రాజేంద్రసింగ్‌బాబుకు ఇచ్చారు.
అతను ఎక్కువగా డబ్బు ఖర్చు చేసినా దానికి తగిన ఔట్‌పుట్ రాబట్టలేకపోయాడు.ఇది గమనించిన కృష్ణ వెంటనే అతడిని తొలగించి వి.
మధుసూదనరావును దర్శకుడిగా పెట్టుకున్నారు. """/" /
ఇదే సమయంలో బాలకృష్ణ, విజయశాంతి హీరోహీరోయిన్లుగా కె.
రాఘవేంద్రరావు ఓ మూవీ స్టార్ట్ చేశాడు.దానికి కూడా ‘సామ్రాట్’( Samrat ) అని టైటిల్ ఖరారు చేశారు.
ఇదే పెద్ద వివాదాన్ని రేపింది.ఈ టైటిల్ తమదంటే తమదంటూ రెండు సినిమాల నిర్మాతలూ గొడవ పెట్టుకున్నారు.
కృష్ణ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.అన్ని పరిశీలించిన జడ్జి ఆ టైటిల్ హక్కులు సూపర్‌స్టార్ కృష్ణకే దక్కుతాయంటూ సంచలన తీర్పు వెలువరించారు.
ఫలితంగా బాలకృష్ణ సినిమా టైటిల్‌ను ‘సాహస సామ్రాట్’గా చేంజ్ చేసుకున్నారు.అప్పట్లో ఈ కాంట్రవర్సీ గురించి చాలామంది మాట్లాడుకున్నారు.
"""/" /
బాలకృష్ణ ‘సాహస సామ్రాట్’ ( Sahasa Samrat ) 1987 ఏప్రిల్ 13న విడుదల చేశారు.
‘సామ్రాట్’ అదే ఏడాది అక్టోబర్ 2న రిలీజ్ అయింది.'సామ్రాట్’ మంచి హిట్ అయింది.
కృష్ణ చేసిన కృషి వల్ల రమేష్ ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ సాధించగలిగాడు.ఇక ఈ హీరోకి తిరుగులేదని అందరూ అనుకున్నారు కానీ రమేష్ ఎందుకో సినిమాలపై ఫోకస్ పెట్టలేదు.
కొన్ని తప్పులు చేస్తూ ఫెయిల్యూర్స్ అందుకున్నారు.15 ఏళ్ల పాటు హీరోగా సినిమాలు చేసినా ఏదీ కూడా హిట్ కాలేదు.
దాంతో నిర్మాతగా అవతారం ఎత్తారు.మహేష్ బాబు నటించిన కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ కూడా చేశారు.
అయితే కృష్ణ ఎంత కష్టపడినా చివరికి తన పెద్ద కొడుకును సక్సెస్‌ఫుల్ హీరోగా చూడలేకపోయారు.
చైతన్య శోభిత పెళ్లి వేదిక ఫిక్స్ అయిందా.. అక్కడే పెళ్లి జరగబోతుందా?