శూర్పణఖ రాముడిపై ఎందుకు మోజు పడింది? ఆమె భర్త ఎవరు?

శూర్పణఖ రావణాసురుడి సోదరి అనే విషయం అందరికీ తెలిసిన విషయమే.కానీ ఆమె శ్రీ రామ చంద్రుడిపై ఎందుకు మోజు పడింది, అలా చూసిన వెంటనే అతనితో ప్రేమలో పడేందుకు కారణమేమిటో మాత్రం చాలా మందికి తెలియదు.

ఇప్పుడు ఆ విషయం గురించి మనం తెలుసుకుందాం.శూర్ఫణఖ పుట్టిన తర్వాత ఆమె తండ్రి మొదటగా ఆమెకు మీనాక్షి అనే పేరు పెట్టాడు.

ఆ తర్వాత ఆమె దుష్ట బుద్ధి గల రాక్షసుడిని వివాహమాడింది.ఆ తర్వాత శూర్ఫణఖ తన భర్తతో కలిసి రావణాసురుడితో అధిక అభిమానాన్ని సంపాదించుకుంది.

రావణాసురుడికి కూడా శూర్పణఖ భర్త అంటే తన బావ అంటే చాలా అభిమానం ఏర్పడింది.

కానీ దుష్ట బుద్ధి గల ఆ రాక్షసుడు మరింత అధికారం కోసం రావణాసురుడి పైనే  కుట్ర పన్నుతాడు.

విషయం తెలుసుకున్న రావణుడు సోదరి భర్త అయిన రాక్షసుడిని చంపేస్తాడు.సొంత అన్నే తన భర్తను చంపాడన్న విషయాన్ని తట్టుకోలేక శూర్పణఖ అరణ్యాల్లో తిరుగుతూ ఉంటుంది.

అలా చాలా చోట్ల గడుపుతూ వెళ్తూ ఉండేది. """/" / అలా వెళ్తున్నప్పుడే పంచవటి అడవిలో శ్రీరాముడిని చూస్తుంది.

ఆయన తేజస్సు, అందానికి ముగ్ధురాలైన శూర్పణఖ వెంటనే అతడితో ప్రేమలో పడుతుంది.అప్పటికే వితంతువుగా ఉన్న ఆమెకు భర్త కావాలనిపిస్తుంది.

అలా శ్రీరామ చంద్రుడిపై మోజు పెంచుకుంటుంది.ఆ కాంక్షతోనే తన మాయ శక్తితో సౌందర్య వతిగా తయారై రాముడి దగ్గరకు వెళ్తుంది.

తనని పెళ్లి చేసుకొమ్మని కోరుతుంది.కానీ అప్పటికే అతను సీతాదేవిని పెళ్లి చేసుకోవడం వల్ల తాను ఏక పత్నీవ్రతుడినని చెప్పి ఆమెను వెళ్లిపోమని చెప్తాడు.

భర్తతో కలిసి ఖరీదైన కారును కొనుగోలు చేసిన సోనాక్షి సిన్హా.. ఈ కారు ఖరీదెంతో తెలుసా?