సుమంత్ ఇన్నేళ్ళుగా ఒంటరిగా ఉండటానికి కారణం ఏంటి ?
TeluguStop.com
ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చి అప్పుడే పాతికేళ్లు కావస్తున్న హీరో సుమంత్.రాంగోపాల్ వర్మ తీసిన ప్రేమ కథ సినిమాతో తొలిసారిగా ఇండస్ట్రీకి 1999 లో హీరోగా పరిచయమయ్యాడు సుమంత్.
ఇక ఆ తర్వాత ఆ పాతిక సినిమాలకు పైగా నటించినా కూడా కెరియర్లో చెప్పుకోదగ్గ సినిమాలు మాత్రం చాలా తక్కువ.
సత్యం, మధుమాసం, గోల్కొండ హై స్కూల్, మళ్లీ రావా, సీతారామం వంటి సినిమాలు ఆయన కెరియర్లో మంచి చిత్రాలుగా నిలిచాయి.
ఆయన సినిమా జీవితం ఎలా ఉన్నా ఆయన వ్యక్తిగత జీవితం కూడా అనేక ఒడిదుడుకుల మధ్య ఉందనే విషయం మనందరికీ తెలుసు.
తన తోటి నటీమణి అయిన కీర్తి రెడ్డిని 2004లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్ రెండేళ్లు తినకుండానే విడాకులు తీసుకున్నాడు.
ఇక వీరి విడాకులకు కారణాలు ఎలా ఉన్నా కీర్తి రెడ్డి మరో వివాహం చేసుకొని తన వైవాహిక జీవితంలో సెటిల్ అయింది.
అంతే కాదు ఇద్దరు పిల్లల్ని కానీ అమెరికాలో బాగానే జీవిస్తోంది.కానీ సుమంత్ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉంటున్నాడు.
"""/"/
అయితే సుమంత్ ఇలా ఒంటరిగా మిగిలిపోవడానికి కారణాలు ఏంటి అనేది చాలామందికి తెలియదు.
కీర్తి రెడ్డి లాగానే సుమంత్ సైతం మరో వివాహం చేసుకొని సెటిల్ అవ్వాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్న మాట.
కానీ మరో పెళ్లి చేసుకునే ఉద్దేశం సుమంత్ కు లేదు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
సినిమా జీవితం ఫెయిల్ అయిన కూడా తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, అలాగే తన ఫ్యామిలీ సపోర్ట్ తనకు బాగా ఉంది కాబట్టి తాను ఇలా ఉండడానికి ఇష్టపడుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు.
అయితే కీర్తి రెడ్డి ని ఇంకా తలుచుకుంటూనే ఉండడంతో మరొక పెళ్లి చేసుకోలేకపోతున్నాడు అనేది ఆయన సన్నిహితుల వాదన.
ఏది ఏమైనా తన యుక్త వయసు ఇలా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం చాల మంది అక్కినేని అభిమానులకు మింగుడు పడటం లేదు.
కుంభమేళాలో ల్యాప్‌టాప్‌తో దర్శనమిచ్చిన భక్తుడు.. నెటిజన్లు షాక్!