సుమ వెండి తెర ఎంట్రీ ఆలస్యంకు కారణం రాజీవ్‌ కనకాలా?

యాంకర్ సుమ నటిగా జయమ్మ పంచాయితీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

బుల్లి తెరపై సందడి చేస్తున్న వారు వెండి తెరపైకి రావాలని కోరుకోవడం సహజం.

ఇరవై ఏళ్లు గా బుల్లి తెరపై హడావుడి చేసిన సుమ ఇప్పుడు వెండి తెరపైకి వచ్చింది.

ఇన్నాళ్ల ఆలస్యం కు కారనం ఏమై ఉంటుంది అంటూ ఇప్పుడు చర్చ మొదలు అయ్యింది.

నటిగా కెరీర్‌ ఆరంభంలోనే సందడి చేసిన సుమ మళ్లీ నటిగా ఎందుకు రీ ఎంట్రీ ఇవ్వాలని అనుకోలేదు.

ఒక వేళ ఆమె అనుకున్నా కూడా ఎందుకు ఆమెకు ఇంత సమయం పట్టింది అంటూ ఒకొక్కరు ఒక్కో విధంగా చర్చలు జరుపుతున్నారు.

ఈ సమయంలో బుల్లి తెర వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సుమ వెండి తెర రీ ఎంట్రీకి ఇన్నేళ్ల సమయం పట్టడానికి కారణం రాజీవ్‌ కనకాల అంటున్నారు.

సుమ వెండి తెరపై కనిపించడం ఆయనకు ఇష్టం లేదట.ఆమె బుల్లి తెరపై చేయడం విషయంలో కూడా ఆయన అసంతృప్తితో ఉన్నారు అనే పుకార్లు గతంలో వచ్చాయి.

ఇద్దరు కొన్ని విషయాల్లో విభేదించి ఏకంగా విడి పోయారు.కాని పిల్లల కోసం మళ్లీ కలిశారు.

ఆమద్య పిల్లలు ఉన్న వారు విడి పోవడం కష్టం. """/"/ కనుక తాము విడి పోలేదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

ఇటీవల సుమ మరియు రాజీవ్ లు గతంలో మాదిరిగా లేరు అని.అలాగే ఎవరి నిర్ణయాలు వారు తీసుకుంటూ ఉన్నారని తెలిసింది.

అందుకే రాజీవ్‌ ఇప్పుడు ఆమెను ఆపే అవకాశం లేదు కనుక జయమ్మ పంచాయితీ సినిమాను సుమ చేసిందని వార్తలు వస్తున్నాయి.

సుమ ఇన్నాళ్లు ఆలస్యం అయ్యింది మంచిదే అయ్యిందా లేదంటే ఇప్పటికే రావాల్సిందా అనేది రేపు సినిమా విడుదల అయితే కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

అయితే రాజీవ్ తరపు వారు మాత్రం ఈ పుకార్లను కొట్టి పారేస్తున్నారు.

నా అల్లుడికి పెద్ద హిట్ రావాలనే అలా చేశాను.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్!