Naga Shaurya :ఆ సలహాలు వేరే హీరోలకు ఎందుకు ఇవ్వరు.. నాగశౌర్య ప్రశ్నకు వాళ్ల దగ్గర సమాధానముందా?
TeluguStop.com
టాలీవుడ్ హీరో నాగశౌర్య గురించి మనందరికీ తెలిసిందే.తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకున్నాడు నాగశౌర్య.
కాగా తాజాగా నటించిన చిత్రం రంగబలి( Rangabali ).త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా నాగశౌర్యకి సంబంధించి ఒక ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
అదేంటంటే మాములుగా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో కొందరు సలహాలు ఇస్తుంటారు.ఫలానా సీక్వెన్స్ వద్దని లేదా ఇది మార్చాలనని ఏదేదో చెబుతుంటారు.
అంత ఆసక్తి ఉన్నప్పుడు అదేదో వాళ్లే డైరెక్షన్ చేసి చూపించొచ్చు. """/" /
ఆ సలహాలు వేరే హీరోలకు ఎందుకు ఇవ్వరు, తాను ఉన్నప్పుడే ఎందుకు ఇస్తారనేది శౌర్య ప్రశ్న.
ఏదైనా ఫ్లాపు వచ్చినప్పుడు అది జనాలకు నాగశౌర్య( Naga Shaurya ) సినిమా పోయిందనే కనిపిస్తుంది, తప్ప వాళ్లకు అసలు కారణాలు ఎలా తెలుస్తాయి.
ఇవన్నీ వినడం వల్లే ఇబ్బంది పడి జరిగిన నష్టాన్ని గుర్తించి క్రమంగా నో చెప్పడం అలవాటు చేసుకున్న శౌర్యకు మరో చేదు అనుభవం పాఠం నేర్పించింది.
గతంలో ఒక సినిమాకు నెరేషన్ ఇచ్చేటప్పుడు ఒకరకమైన సెటప్ ని వివరించి, తీరా షూటింగ్ స్పాట్ లో అంతా మార్చేసినప్పుడు ఈ మాత్రం దానికి తీయడం ఎందుకని నిలదీసిన సందర్భంగా కూడా వచ్చిందట.
"""/" /
కళ్ళముందే రాబోయే ఫ్లాప్ లో భాగం కావాల్సి వచ్చినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి తలెత్తుంది.
అప్పటి నుంచి సజెషన్స్ ఇచ్చేవాళ్లకు దండం పెట్టడమే అలవాటు చేసుకున్నాడట శౌర్య.ఇక్కడ ఓపెనయ్యాడు కానీ నిజానికి చాలా మీడియం రేంజ్ హీరోలకు ఈ సమస్య ఉంది.
కానీ అవతలి వాళ్ళ జడ్జ్ మెంట్ ని గుడ్డిగా నమ్మడం వల్లనో, లేదా వాళ్ళు చెప్పింది చేయకపోతే నిజంగానే దెబ్బ తింటామేమోనన్న భయమో మొత్తానికి నష్టమే తెచ్చి పెడుతోంది.
ఇది ప్రాక్టికల్ గా ఆలోచించాల్సిన విషయం.మార్కెట్ ని స్టడీ చేయాల్సిన తరుణం.
రంగబలిలో పూర్తిగా కమర్షియల్ ప్లస్ ఎంటర్ టైనర్ పాత్ర చేస్తున్న నాగశౌర్య బహుశా ఈ అనుభవాల దృష్ట్యానే ప్రయోగాలు రిస్కులు జోలికి వెళ్లకుండా వినోదం వైపు మొగ్గు చూపాడు నాగశౌర్య.
టీడీపీ కి గవర్నర్ పదవి .. ఈ ముగ్గురిలో బాబు ఛాయిస్ ఎవరో ?