ఉషా కిరణ్ మూవీస్ వల్ల సౌందర్య నటించిన చివరి సినిమా విడుదలకు నోచుకోలేదా ?

అందాల సౌందర్య( Soundarya ) కన్నుమూసి నేటికి 20 ఏళ్లు ఆమె చేసిన ప్రయాణం, నటించిన సినిమాలు ప్రతి ఒక్క నటికి ఆదర్శం.

సావిత్రి మహానటిగా ఎన్నో ఏళ్లపాటు కీర్తించబడితే సౌందర్య మరో సావిత్రిగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి వరంలా దొరికింది.

ఆమె సినిమా ఇండస్ట్రీకి తొలిసారిగా పరిచయం అయింది రైతు భారతం( Raithu Bharatham ) అనే చిత్రంతో.

ఈ సినిమాలో నటించేందుకు గాను త్రిపురనేని వరప్రసాద్ సౌందర్య తండ్రిని ఒప్పించి కర్ణాటక నుంచి తెలుగు లోకి రప్పించారు.

20 ఏళ్ల పాటు నిర్విరామంగా నటించిన సౌందర్య విమాన ప్రమాదంలో కన్ను మూసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది.

"""/" / అయితే ఆమె చివరగా నటించిన చిత్రం ఉషా కిరణ్ మూవీస్( Usha Kiran Movies ) సంస్థ వల్ల విడుదలకు నోచుకోకుండా ఉండిపోయింది.

ఆమెను సినిమా పరిశ్రమకు తీసుకువచ్చినందుకు గాను సౌందర్య ఎంతో అభిమానంతో త్రిపురనేని వరప్రసాద్ అడగగానే గెలుపు( Gelupu Movie ) అనే చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది.

అందులో నటించిన సమయం చాలా తక్కువే అయినప్పటికీ అదే ఆమె నటించడం చివరి సినిమా కావడం విశేషం.

అయితే ఆ సినిమాను మొదట ఉషాకిరణ్ మూవీస్ వారు 10% బడ్జెట్ కి మించి తీసుకుంటామని చెప్పారు.

సినిమా పూర్తయింది మధ్యలో ఎంతమంది అడిగినా ఉషా కిరణ్ మూవీస్ వారు తీసుకుంటారు అని నమ్మకంతో వరప్రసాద్ ఎవరికి ఇవ్వలేదు.

"""/" / అయితే సినిమా విడుదలయ్యే నాటికి ఉషా కిరణ్ మూవీస్ కొన్ని సినిమాల పరాజయాలతో నష్టాల్లో కూరుకుపోయింది.

దాంతో ఏం చేయాలో తెలియని ఉషాకిరణ్ మూవీస్ ఆ సినిమాను కొనడానికి ముందుకు రాలేదు.

అదే సమయంలో ఆలస్యం కావడంతో వేరే డిస్ట్రిబ్యూటర్స్ కూడా కొనేందుకు ఒప్పుకోకపోవడంతో అది స్టూడియోలోనే మిగిలిపోయింది.

అలా సౌందర్య నటించిన చివరి సినిమా ఉషా కిరణ్ మూవీస్ వల్ల విడుదలకు నోచుకోకుండా ఉండిపోయింది.

నేటికి కూడా గెలుపు చిత్రం సౌందర్య చివరి చిత్రంగా( Soundarya Last Movie ) అలాగే ఉంది.

సౌందర్య అభిమాన ప్రమాదంలో కన్నుమూసుకుని తెలియగానే యావత్ తెలుగు సినీ ప్రపంచం శోకంలో మునిగిపోయింది.

ఆమె మరణించి 20 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఎంతోమంది సౌందర్యను అభిమానిస్తూనే ఉన్నారు.

సావిత్రి లాగా సౌందర్య కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి దొరికిన అపురూపమైన వజ్రం.

మాస్ జాతర గ్లింప్స్ తో రవితేజ ఈజ్ బ్యాక్ అనాల్సిందేనా..?ఒకప్పటి రవితేజ గుర్తుకు వచ్చాడా..?