సుస్వాగతం నుంచి అన్నమయ్య వరకు శోభన్ బాబు ఇన్ని సినిమాలను రిజెక్ట్ చేసారా ?
TeluguStop.com
తెలుగు ప్రజల హృదయాల్లో సోగ్గాడిగా శోభన్ బాబు( Sobhan Babu ) చిరస్థాయిగా నిలిచిపోతారు.
70 ఏళ్ల వయసులో ఆయన చెన్నైలో కన్నుమూశారు.తెలుగు, తమిళ చిత్రసీమలలో ప్రముఖ నటుడిగా పేరు తెచ్చుకున్న శోభన్ బాబు 2007 వరకు నటిస్తూనే ఉన్నారు.
అయితే సినీ ప్రస్థానంలో తనకంటూ ఆయన ఓ ప్రత్యేకత తెచ్చుకున్నారు.ముఖ్యంగా ఆయన చివరి వరకు హీరోగానే నటించారు.
పలు హిట్ సినిమాల్లో కీలకమైన పాత్రలు చేయాలని ఆయనకు ఆఫర్లు వచ్చినా, సున్నితంగా ఆయన తిరస్కరించారు.
తాను హీరోగానే చేశానని, అదే స్థాయిలో సినిమాల నుంచి రిటైర్ అయ్యానని పేర్కొన్నారు.
ఆయన ముందుచూపును ఇప్పటికీ నటులంతా గుర్తు చేసుకుంటారు.ముఖ్యంగా నటీనటులు, సినీ రంగానికి చెందిన వారిని భూములను కొనుగోలు చేయాలని ఆయన సూచించేవారు.
ఆయన చెప్పిన ప్రాంతాల్లో ఒకప్పుడు విలువ లేని భూమి ప్రస్తుతం కోట్లలో పలుకుతోంది.
అప్పట్లో ఆయన చెప్పిన మాట విని, చెప్పిన చోట భూములు కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని నటి జయసుధ కూడా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
"""/" /
ఇక తాను ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండే వ్యక్తిగా శోభన్ బాబు పేరు గడించారు.
ఆయనకు సంబంధించిన ఆసక్తికర విషయం తెలుసుకుందాం.తెలుగు చిత్రసీమకు ఎన్టీఆర్,( NTR ) ఏఎన్నార్( ANR ) వంటి వారు రెండు కళ్లు అంటారు.
అలాంటి ఏఎన్నార్ కూడా హీరో పాత్రలకు స్వస్తి పలికి, వృద్ధాప్యంలో ఎన్నో మరుపురాని పాత్రలు చేశారు.
అయితే ఈ విధానానికి శోభన్ బాబు వ్యతిరేకం.చివరి వరకు ఆయన హీరోగానే నటించారు.
"""/" /
తెలుగులో హిట్ చిత్రాలుగా నిలిచిన సుస్వాగతం,( Suswagatham ) అతడు,( Athadu ) అన్నమయ్య( Annamaiah ) సినిమాల్లో కీలక పాత్రల కోసం శోభన్ బాబును టాలీవుడ్ నిర్మాతలు సంప్రదించారు.
మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన అతడు సినిమాలో నాజర్ పాత్రకు తొలుత శోభన్ బాబు చేస్తే బాగుంటుందని అంతా భావించారు.
నిర్మాత మురళీ మోహన్ తన అసిస్టెంట్‌తో బ్లాంక్ చెక్‌ను శోభన్ బాబుకు పంపించారు.
అయినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు.ఇక అతడు ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో తెలిసిందే.
"""/" /
ఇక బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) ప్రధాన పాత్రలో రూపొందించిన 'బ్లాక్' సినిమాను( Black Movie ) తెలుగులో శోభన్ బాబు హీరోగా తీద్దామని నిర్మాత ఆర్బీ చౌదరి భావించారు.
దీనికి శోభన్ బాబు ఒప్పుకోలేదు.ప్రేక్షకులు తనను హీరోగానే తమ హృదయాల్లో ముద్ర వేసుకున్నారని, డబ్బుల కోసం సహాయక పాత్రలు చేసి వారి అభిమానాన్ని పోగొట్టు కోలేనని ఆయన చెప్పేవారు.
ఇక వృద్ధాప్యంలో చెన్నైలో తన కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపారు.ఎంత పెద్ద హీరో అయినప్పటికీ ఆయన తన వారసులను సినీ రంగానికి దూరంగా ఉంచారు.
రాజమౌళికి పోటీగా మారుతున్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ.. ఇద్దరిలో నంబర్ వన్ ఎవరు?