ఒకప్పుడు యూత్ లో సిద్ధార్థ్( Siddharth ) అంటే ఒకరకమైన క్రేజ్.
నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు సినిమాలతో సిద్ధార్థ్ స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు.సిద్ధార్థ్ సినిమా అంటే చాలు యూత్ ఆడియన్స్ అంతా కూడా మొదటిరోజు చూసేవారు.
కానీ ఎందుకో సిద్ధార్థ్ తర్వాత సినిమాలు అంతగా మంచి ఫలితాలను అందుకోలేదు.తన మాతృ భాష తమిళంలో వరుస సినిమాలు చేస్తూ అక్కడ ఫ్యాన్స్ ని అలరించిన సిద్ధార్థ్ మళ్లీ తెలుగులో బిజీ అవ్వాలని చూస్తున్నాడు.
"""/" /
లేటెస్ట్ గా టక్కర్ అంటూ మరో సినిమాతో వస్తున్నాడు సిద్ధార్థ్.
ఆల్రెడీ మహా సముద్రం( Maha Samudram ) సినిమాతో రీ ఎంట్రీ గ్రాండ్ గా ఇచ్చినా ఆ సినిమా హిట్ అయితే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా ఫెయిల్ అవడం వల్ల సిద్ధార్థ్ జోరు కొనసాగించలేకపోయాడు.
టక్కర్( Takkar ) మీద చాలా హోప్స్ పెట్టుకోగా కచ్చితంగా ఈ సినిమా తనకు మంచి విజయాన్ని అందిస్తుందని అంటున్నారు.
మరి సడెన్ గా తెలుగులో వరుస సినిమాలు చేయాలని ఎందుకు అనిపించిందో కానీ సిద్ధుని ఇష్టపడే తెలుగు ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు.
ఇక మీదట గ్యాప్ లేకుండా సిద్ధార్థ్ తెలుగు సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాడు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై ఎమోషనల్ పోస్ట్ చేసిన బండ్ల గణేష్… జాగ్రత్త అంటూ!