ఐటీ మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయాలి.. కేటీఆర్

పేపర్ లీక్‎లో అరెస్ట్ అయిన రాజశేఖర్.బీజేపీ కార్యకర్త అని మంత్రి కేటీఆర్ అన్నారు.

పేపర్ లీక్ పై తమకు కూడా అనుమానాలు ఉన్నాయని ఉందని చెప్పారు.పేపర్ లీక్ కేసులో బీజేపీ కార్యకర్త ఏ-2గా ఉన్నాడని తెలిపారు.

నోటిఫికేషన్లే కుట్ర అన్న బీజేపీ నేతలపై అనుమానం ఉందని వెల్లడించారు.రాజకీయ కుట్ర ఉందనే అనుమానం ఉందని పేర్కోన్నారు.

దీనిపై దర్యాప్తు చేయాలని డీజీపీని కోరుతామని తెలిపారు.ఈ నేపథ్యంలో భావోద్వేగాలు రెచ్చగొట్టదని సూచించారు.

పేపర్ లీక్ వ్యవహారంలో ఐటీ మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయాలని ప్రశ్నించారు.పేపర్ లీక్ తో ఐటీ డిపార్ట్‎మెంట్ కు ఏం సంబంధమో చెప్పాలని డిమాండ్ చేశారు.

గుజరాత్ లో 13 పేపర్లు లీక్ అయ్యాయన్న కేటీఆర్ బీజేపీ మంత్రులు రాజీనామా చేశారా అని ప్రశ్నించారు.

అపోహలు వచ్చేలా అడ్డగోలు వ్యాఖ్యలు చేయొద్దని స్పష్టం చేశారు.

నాలుగు కొత్త Ai ల్యాప్ టాప్ లను లాంఛ్ చేసిన డెల్.. ఫీచర్లు ఇవే..!