షర్మిల తెలంగాణ నుంచి ఏపీకి ఎందుకు వచ్చారు..: సజ్జల
TeluguStop.com

ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై( YS Sharmila ) వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) మండిపడ్డారు.


షర్మిల వాడిన భాష సరికాదని పేర్కొన్నారు.షర్మిల వ్యాఖ్యలు తామందరికీ బాధ కలిగించాయని సజ్జల తెలిపారు.


కాంగ్రెస్ పార్టీ( Congress Party ) గురించి షర్మిలకు ఏం తెలుసని ప్రశ్నించారు.
సీఎం జగన్ ప్రజలతో మమేకం అవుతున్నారని పేర్కొన్నారు.రాష్ట్రానికి కాంగ్రెస్ ఎంతో ద్రోహం చేసిందన్నారు.
"""/" /
అలాగే వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంతగా వేధించిందో అందరికీ తెలుసని పేర్కొన్నారు.
వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చింది కూడా కాంగ్రెస్ పార్టీనేనని తెలిపారు.వైఎస్ ఆశయాలకు సీఎం జగన్( CM Jagan ) కట్టుబడి పని చేస్తున్నారని తెలిపారు.
ఏపీని విడగొట్టిందే కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు.తెలంగాణలో షర్మిల ఏం చేశారని ప్రశ్నించిన సజ్జల అక్కడి నుంచి హఠాత్తుగా ఏపీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
టీ, కాఫీ బదులు ఈ డ్రింక్ తాగితే ఆరోగ్యమే కాదు అందం కూడా పెరుగుతుంది!