మద్యం మానేసిన సావిత్రి మరోమారు ఎందుకు మళ్లి దానికి బానిస అయ్యారు ?
TeluguStop.com
ఆస్తులు, అంతస్తులు, సంసారం అన్ని ఉన్నప్పుడు ఏది కళ్ళకు కనిపించదు.కళ్ళతోనే అభినయించే సావిత్రి కూడా అన్ని బాగున్నా రోజుల్లో ఏది లెక్క చేయలేదు.
నిజం చెప్పాలంటే ఏది కాపాడుకోలేదు.భర్త మోసం కళ్లారా చుసిన ఆమె తట్టుకోలేదు.
పిల్లల గురించి, సినిమాల గురించి, ఆస్తుల గురించి ఏమాత్రం ఆలోచించలేదు.అందుకే జెమినీ పోయాడు, ఆ వెనకే ఆస్తులు పోయాయి.
చివరికి బ్రతుకుదెరువు కోసం చిన్న చిన్న పాత్రలు కూడా చేయాల్సి వచ్చింది.ఎంతో సాధించిన ఆమె చాల చిన్న సినిమాల కోసం కూడా పని చేసింది.
చివరికి నెలంతా కాల్షీట్స్ ఇచ్చిన కేవలం ఆరు రోజులు మాత్రమే వాడుకున్న 24 రోజులు ఎదో ఒక సీన్ ఇవ్వకపోతారా అని ఎదురుచూసింది.
అయినా ఆమెను విధి కనికరించలేదు.ఆమె చివరగా మెలకువతో ఉండగా శ్వస తీసుకుంది బెంగుళూర్ లోని ఒక హోటల్ గదిలో.
ఇది అరగదాయ అనే సినిమాలో ఆమె చిన్న వేషం ఒప్పుకుంది.ఆ సినిమా కోసం యూనిట్ వారు కేటాయించిన రూంలోనే తాను బస చేసింది.
రాత్రంతా ఎంత ప్రయతించిన ఆమెకు నిద్ర పట్టలేదు.గతమంతా కళ్ళముందు గిర్రున తిరిగింది.
బెడ్ అంత కూడా దొర్లినా ఆమె కంటికి నొప్పితో కునుకు రాలేదు.ఎలాంటి వైభోగాలు చుసిన తాను ఎలాంటి స్థితిలో ఉన్నాను అని తనలో తానే కుమిలిపోయింది.
అప్పటికి షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని డాక్టర్ సలహాతో మందు మానేసింది.అయినా ఆ రాత్రి గడిస్తే ఎలా ఉండేదో కానీ అది కాళరాత్రి అవుతుంది అని ఎవరు ఊహించలేదు.
తరుముఖస్తున్న దుఃఖాన్ని దిగమింగుకోలేకపోయింది.ఆమెను ఆమె నిగ్రహించుకోలేకపోయింది.
"""/"/
దాంతో హోటల్ బాయ్ తో ఒక బాటిల్ తెప్పించుకొని తడడం మొదలు పెట్టింది.
సీసా ముగిసే వరకు తాగడం ఆపలేదు.ఎప్పుడు కన్ను మూత పడిందో తెలియదు.
తెల్లారి ప్రొడక్షన్ నుంచి ఆమెను షూటింగ్ కి తీసుకెళ్లడానికి డ్రైవర్ కారు తీసుకొని వచ్చాడు.
ఎంత సేపు తలుపు కొట్టిన తీయకపోవడం తో హోటల్ వారు డూప్లికేట్ తాళంచెవి తో తలుపులు ఓపెన్ చేసి చూడగా చిందరవందరగా పడి ఉన్న మందు సీసా, గ్లాసులు దర్శనం ఇచ్చాయి.
అప్పటికే ఆ మహానటి కోమాలోకి వెళ్ళిపోయింది.ఆ తర్వాత 596 రోజులకు ఆమె శ్వాసించడం ఆగిపోయింది.
భారత సంతతి నిర్మాతకు వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో అరుదైన గౌరవం