Mahanati Savitri : సావిత్రి కి చివరి దశలో ఎవరి సహాయం అందకపోవడానికి ఆ హీరోనే కారణమా ?

మహానటి సావిత్రి( Mahanati Savitri ) గురించి ఎన్నో వందల ఆర్టికల్స్ ఇప్పటికే సోషల్ మీడియా నిండా ఉన్నప్పటికీ ఆమె గురించి ఏదో ఒక వార్త వైరల్ గా మారుతూనే ఉంటుంది.

చిర్రావూరులో( Chirravur ) పుట్టి పెరిగిన సావిత్రి అటు తెలుగు మరియు ఇటు తమిళ ప్రేక్షకుల ఆదరణ పొంది రెండు రాష్ట్రాల్లో కొన్ని ఏళ్ల పాటు నటిగా ఏకచిత్రాధిపత్యం చేశారు.

ఆమెకు అప్పటి హీరోలు అంతా ఎంతో సన్నిహితులే అందుకే ఆమెతో నటించాలని పోటీపడేవారు.

ఆమె ఉన్న సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్న భావన అభిమానుల్లో ఉండేది.శ్రీకాకుళం చుట్టూ మారుమూల పల్లెల నుంచి ఆమెను చూడ్డానికి ప్రతి రోజు మద్రాస్ కు చేరుకునేవారు ప్రేక్షకులు.

వారందరికీ తినడానికి భోజనము, తిరిగి వెళ్ళడానికి దారి ఖర్చులు కూడా ఇచ్చి ఆమె ఉదారతను చాటుకునేవారు.

"""/" / మరి ఇంత వైభోగం చూసినటువంటి మహానటి సావిత్రి చివరి రోజుల్లో ఎంతో ఇబ్బందుల్లో ఉంటే ఎన్టీఆర్ మరియు శివాజీ గణేషన్ ( NTR , Shivaji Ganesan )తో పాటు అటు ఎంజీఆర్ కూడా ఆమెకు ఎటువంటి సహాయం చేయలేదు.

అందుకు కొన్ని చిన్న చిన్న కారణాలు కూడా ఉన్నాయి అంటూ ఉంటారు కొంతమంది తెలిసిన వాళ్ళు ఎందుకంటే ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా అక్కినేనితో సినిమాలు చేయడం వల్ల ఎన్టీఆర్ మరియు శివాజీ గణేషన్ ఎంజీఆర్ ( Mgr )వంటి సినిమాల్లో నటించడానికి అవకాశం దొరికేది కాదట.

దాదాపు మూడు దశాబ్దాల పాటు అక్కినేని ( Akkineni )ఆమెను తన సినిమాలోని నటించే విధంగా బ్లాక్ చేసుకునేవారని ఆమె డేట్స్ కోసం ఎప్పుడూ తొందర పడేవారని అంటూ ఉంటారు.

"""/" / అందువల్ల మిగతా హీరోలకు ఆమెకు సాన్నిహిత్యం తక్కువగా ఉండేదట అందుకే ఆమె కష్టాల్లో ఉన్న సమయంలో ఏ హీరో కూడా ఆదుకోవడానికి ముందుకు రాలేదు అన్ని సినిమాల్లో నటించినా అక్కినేని కూడా ఆమెను దూరం పెట్టారు.

సినిమాల్లో నటించేంతవరకే కానీ ఆ తర్వాత వారికి సంబంధం లేనట్టుగా ఉండేవారట.అలా అక్కినేని తన సినిమాల్లో సావిత్రి నటింప చేయాలన్న ఏకైక స్వార్థంతో ఆమెను మిగతా హీరోల సినిమాల్లో ఎక్కువగా నటించకుండా చేయడంతో ఆమె చివరి దశలో ఎవరి సహాయానికి నోచుకోలేదట.

సస్పెన్స్‌కు తెరదించిన ట్రంప్ .. రిపబ్లికన్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్ధిగా జేడీ వాన్స్