Santosh Sobhan : ప్రభాస్ చెయ్యి అందించిన సంతోష్ శోభన్ పరిస్థితి ఏంటి ఇలా ఉంది ?
TeluguStop.com
సంతోష్ శోభన్.( Santosh Sobhan ) మంచి మంచి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న వారిలో సంతోష్ శోభన్ కూడా ఒకరు.
ఏదో ఒక సినిమాతో ఎల్లప్పుడూ కామెడీ జనరేట్ చేసే పనిలోనే ఉంటాడు.అయితే ఈ సంతోష్ మరెవరో కాదు వర్షం లాంటి హిట్టు సినిమా తీసిన శోభన్ యొక్క పెద్ద కుమారుడు.
ఇక సంతోష్ విషయానికి వచ్చేసరికి తన సక్సెస్ కి కారణం ఎవరు అని అడిగితే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా కేవలం ప్రభాస్( Prabhas ) అనే పేరు మాత్రం చెబుతాడు.
ఎందుకంటే ప్రభాస్ సంతోష్ ని మొదటి నుంచి ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు.అతని సినిమాలు ఏది విడుదలైనా కూడా తన సోషల్ మీడియా ద్వారా వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటాడు.
అలాగే అతడు తీసిన మూడు సినిమాలను ప్రభాస్ నిర్మించాడు కూడా. """/" /
ఏక్ మినీ కథ, కళ్యాణం కమనీయం, మంచి రోజులు వచ్చాయి అని ఈ మూడు సినిమాలను ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యువీ క్రియేషన్స్ తరఫున నిర్మించాడు.
అంతే కాదు సంతోష్ ఏ సినిమాలో నటించిన దానికి ప్రభాస్ సపోర్ట్ దొరుకుతుంది.
దానికి గల ముఖ్య కారణం ప్రభాస్ కెరియర్ లో మొట్టమొదటి బ్లాక్ బాస్టర్ హిట్ అయిన వర్షం( Varsham ) సినిమాకి సంతోష్ తండ్రి శోభన్( Sobhan ) దర్శకత్వం వహించాడు.
ఆ ఒక్క కారణంతోనే మొదటి నుంచి సంతోష్ ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్నాడు, సంతోష్ కోసం ప్రభాస్ ఎంత చేసినా మాత్రం ఏం లాభం చెప్పండి ? అతని సినిమాలు వసూళ్ల పరంగా పెద్దగా లాభాలు తీసుకురావడం లేదు.
హీరోగా ఓకే కానీ స్టార్ హీరో అవుతాడా లేదా అంటే పెద్ద అనుమానమే.
"""/" /
2023 లో నాలుగు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఒక్క చిత్రం కూడా బ్రేక్ ఈవెన్ దాటలేదు.
ఇక ఇప్పుడు మరో సినిమా షూటింగ్ దశలో ఉంది.సంతోష్ శోభన్ తమ్ముడు సంగీత్ శోభన్( Sangeeth Shoban ) మ్యాడ్ సినిమాతో( Mad Movie ) మంచి నటుడిగా పేరు సంపాదించుకోగా సంతోష్ కి మాత్రం ఆరెంజ్ క్రేజ్ దక్కలేదు.
ఇక ముందు ముందు అయినా మంచి సినిమాల్లో నటించి ప్రభాస్ పేరు,తో పాటు తన తండ్రి శోభన్ పేరు కాపాడుతాడో లేదో అనేది వేచి చూడాలి.
రెండు స్పూన్ల బియ్యంతో హెయిర్ ఫాల్ దూరం.. ఎలా వాడాలంటే?