Sai Pallavi: సాయి పల్లవి మాత్రమే కాదు… ఆమె కుటుంబం అంతా అంతే ..!

సాయి పల్లవి.( Sai Pallavi ) టాలీవుడ్ లోనే మోస్ట్ క్రేజ్ ఉన్న హీరోయిన్.

గత ఏడాది మొత్తం ఒక్క సినిమా కూడా ఆమె చేయలేదు.అయినా కూడా ఆమెకు ఫ్యాన్ బేస్ ఏమాత్రం తగ్గకపోగా ఆమె గురించి సెర్చ్ చేస్తూ గూగుల్ లో మోస్ట్ సెర్చుడ్ సెలబ్రిటీగా మార్చేశారు.

అయితే ఇప్పుడిప్పుడే మళ్ళీ సినిమాలు ఒప్పుకుంటూ బిజీ అవుతుంది.ప్రస్తుతం టాలీవుడ్ లో నాగచైతన్యతో తండెల్( Tandel ) అనే ఒక సినిమా చేయడానికి ఒప్పుకుంది.

వీరి కాంబినేషన్లో ఇప్పటికే లవ్ స్టోరీ చిత్రం( Love Story ) వచ్చి మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే.

అయితే చాలామంది హీరోయిన్స్ కి సాయి పల్లవికి తేడా ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సింపుల్ గా ఉండటానికి ఇష్టపడుతుంది, డాన్స్ ఇరగదీస్తుంది, అలాగే ఎలాంటి హెచ్చులకు పోదు, లిప్ లాక్స్ కుదరనే కుదరదు, ఎక్స్పోజింగ్ మాట కూడా ఎత్తదు, కథ నచ్చితేనే చేస్తుంది అంతకన్నా ముందు ఆమె పాత్ర కూడా నచ్చాలి.

"""/" / ఇలా ఎన్ని కండిషన్స్ ఉన్నాయి కాబట్టే సాయి పల్లవి ఎడాపెడా సినిమాల్లో నటించడం లేదు.

మరి సాయి పల్లవికి ఎందుకు సగటు హీరోయిన్స్ కి ఉన్న లక్షణాలు లేవు.

హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అని చాలామంది కొన్ని సమీకరణాలు ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు కదా.

వీటన్నిటికీ సాయి పల్లవి మాత్రమే ఎందుకు విరుద్ధంగా ఉంటుంది అంటే అది ఆమె కుటుంబం నేపథ్యం అని ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి.

సోషల్ మీడియాలో సాయి పల్లవి చెల్లెలు( Sai Pallavi Sister ) ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వీడియోలు పూర్తిగా వైరల్ అవుతున్నాయి.

సాయి పల్లవి మరియు ఆమె చెల్లెలు నిశ్చితార్థం కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో చూసిన తర్వాత చాలామంది ఏంటి ఇంత సింపుల్ గా ఒక హీరోయిన్ ఇంట్లో పెళ్లి సంబరాలు జరుగుతున్నాయి అని అనుకోని వారు ఉంటారా చెప్పండి.

"""/" / హీరోయిన్ ఇంట్లో ఎంగేజ్మెంట్( Engagement ) అయినా పెళ్లయిన చివరికి చిన్న పండగ వచ్చిన కోలాహలం వేరే రేంజ్ లో ఉంటుంది.

కానీ చాలా సింపుల్ బయట కుర్తాలో సాయి పల్లవి కనిపిస్తుంది.ఆమె చెల్లెలు కూడా చాలా సాదాసీదాగా తన నిశ్చితార్థం చేసుకుంది.

దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు సాయి పల్లవి తల్లిదండ్రులు ఎంత పద్ధతిగా ఆడపిల్లలని పెంచారో.

ఇలాగే ప్రతి ఒక్క అమ్మాయి తన ఇండివిజువాలిటీ దెబ్బతినకుండా ఏది కావాలంటే అది చేస్తూ తప్పు జరగడానికి ఎలాంటి సాహసం చేయకుండా ఉంటే ఎంత బాగుంటుంది చెప్పండి.

ఈ వారం ఓటిటి లవర్స్ కు పండుగే.. దేవరతో పాటు పలు సినిమాలు స్ట్రీమింగ్