రేవంత్ రెడ్డి ఆగ్రహానికి కారణం ఏంటి ?

తెలంగాణ ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరుపొందిన రేవంత్ రెడ్డి చాలారోజులుగా నిరాశా గాను, సొంత పార్టీపై ఆగ్రహంగా ఉన్నట్టుగా కనిపిస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి కోసం అధిష్టానం కసరత్తు చేస్తోంది.రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే పిసిసి చీఫ్ గా చేసేందుకు అధిష్టానం పావులు కదుపుతోంది అనే వార్తల నేపథ్యంలో ఆ పదవి తనకే వస్తుందన్న ధీమాతో ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఉన్నారు.

ఆయనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విహెచ్, మల్లు భట్టి విక్రమార్క, జగ్గా రెడ్డి తదితరులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

ఈ విషయంపై తెలంగాణ కాంగ్రెస్ లో గందరగోళం నెలకొన్నా కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం తన మనసులో ఏముంది అనేది క్లారిటీ ఇవ్వడం లేదు.

ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. """/"/రాజకీయ ఉద్దండుడు తెలంగాణ సీఎం కేసీఆర్ ను సమర్థవంతంగా ఎదుర్కొనే సత్తా ఉన్న నాయకుడుగా రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తారనే ప్రచారం తెలంగాణలో జోరుగా సాగుతోంది.

అదీకాకుండా రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అండదండలు ఉన్నాయని, కాబట్టి ఆయనకి ఈ పదవి దక్కుతుందని అంతా అంచనా వేస్తున్నారు.

సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్టి పరిస్థితుల్లో అయినా అధ్యక్ష పీఠం దక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.

కెసిఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ అధిష్టానం దృష్టిని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

కానీ హైకమాండ్ మాత్రం ఏ విషయం తేల్చకుండా మరింత ఆలస్యం చేయ డంతో రేవంత్ రెడ్డి తో పాటు పిసిసి అధ్యక్ష పీఠం దక్కించుకోవాలని ఎదురుచూస్తున్న నాయకులు కూడా అధిష్టానం తీరుపై అసహనంతో ఉన్నారు.

"""/"/ ఇప్పటికే పార్టీ పరిస్థితి తెలంగాణలో అంతంత మాత్రంగా ఉందని, ఈ పరిస్థితుల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోకుండా, నాంచివేత ధోరణి అవలంబిస్తే మొదటికే మోసం వస్తుందని చెబుతున్నారు.

అయితే అధిష్టానం మాత్రం పిసిసి అధ్యక్ష పదవి చేపడితే గ్రూపు రాజకీయాలు బయటపడే అవకాశం ఉందని, కోరి కష్టాలు తెచ్చుకోవడం ఎందుకని ఆలోచిస్తున్నట్టున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఈ విషయంపైనే రేవంత్ రెడ్డి చాలా అసహనంతోనూ, అసంతృప్తితోనూ ఉన్నట్లు ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

తనకు కాకుండా వేరొకరికి పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని ఆయన తన సన్నిహితుల దగ్గర చెప్పినట్లు సమాచారం.

ఈ పరిస్థితుల్లో టి.పిసిసి అధ్యక్ష పదవిన భర్తీ చేయడం అధిష్టానానికి కత్తి మీద సాములా మారింది.

గేమ్ చేంజర్ సినిమా పోస్ట్ పోన్ అవ్వడం వెనక కారణం ఏంటి..?