రవితేజకు డబ్బు పిచ్చా.. మరి ఇలా ఎందుకు చేస్తున్నాడబ్బా?

ఎన్నో కష్టాలు పడి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి సొంత టాలెంటుతో అవకాశాలు దక్కించుకొని.

సైడ్ క్యారెక్టర్లు దగ్గర నుంచి ఏకంగా హీరో స్థాయికి ఎదిగాడు రవితేజ.ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు.

తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా రవితేజ ను మాస్ మహారాజా కామెడీ కింగ్ అంటూ ముద్దు పేర్లతో కూడా పిలుస్తుంటారు అని చెప్పాలి.

అయితే క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న రవితేజ ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీ బిజీగా మారిపోయాడు అన్న విషయం తెలిసిందే.

కానీ క్రాక్ సినిమాకి ముందు మాత్రం రవితేజ కెరీర్లో ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాడు.

పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఇక చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించకపోవడంతో రవితేజ కెరీర్ ముగిసిపోయింది అని అనుకున్నారు అందరు.

కానీ ఆ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమాతో హిట్ కొట్టేశాడు.

తర్వాత బ్యాక్ టు బ్యాక్ 4 చిత్రాలను ప్రకటించాడు.రామారావు ఆన్ డ్యూటీ,రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ధమాకా లాంటి సినిమాలు షూటింగ్ లతో బిజీగా ఉన్నాడు.

ఇటీవలే మధ్యలో వచ్చిన కిలాడి సినిమా ఎందుకో ప్రేక్షకుల ఆదరణ మాత్రం పొందలేకపోయింది.

ఇక ఈ మూవీ విషయంలో దర్శక నిర్మాతలతో విభేదాలు ఏర్పడ్డాయని ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా తెలిసిపోయింది.

"""/" / ఈ ప్రభావం అటు సినిమాపై కూడా పడి చివరికి అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది అని చెప్పాలి.

అయితే ఇలాంటి సినిమా సమయంలో నిర్మాత కోనేరు సత్యనారాయణను ఎక్కువ రెమ్యునరేషన్ కోసం రవితేజ ఇబ్బంది పెట్టినట్లు టాక్ కూడా ఉంది.

ఇక ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమా సమయంలో కూడా నిర్మాతలకు ఇలాంటి ఇబ్బంది ఎదురవుతోందట అత్యధిక రెమ్యునరేషన్ ఇవ్వాలంటూ ఈ సినిమా నిర్మాతలను డిమాండ్ చేస్తున్నాడట రవితేజ.

ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.ఇలాంటి సమయంలో రవితేజ నిర్మాతలకు మధ్య విభేదాలు తలెత్తితే మాత్రం కష్టం అన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.

మొత్తంగా రవితేజ ధన దాహానికి నిర్మాతలు బలవుతున్నారని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.