కాంతారా సినిమాను రష్మిక వదిలేయడానికి గల మూడు కారణాలు ఇవే !
TeluguStop.com
ప్రస్తుతం ఎక్కడ విన్న కాంతారా సినిమా గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు.
ప్రస్తుతం కన్నడలోనే కాదు యావత్ ఇండియాలో కూడా ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ మూవీ గా నిలిచింది కాంతారా.
ఈ సినిమా గురించి ప్రత్యేకంగా ఇప్పటికే అనేక ఆర్టికల్స్ లో మనం తెలుసుకున్నాం.
అయితే ఈ సినిమాను రష్మిక హీరోయిన్ గా చేయాల్సి ఉండింది అయితే ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడం తో ఆ తర్వాత సప్తమి గౌడ అనే మరో నటితో ఈ సినిమా పూర్తి చేశారు.
మరి రష్మిక ఈ సినిమాను వదిలేయడానికి గల ఆ ముఖ్యమైన మూడు కారణాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
H3 Class=subheader-styleపారితోషకం/h3p
వాస్తవానికి రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది.
ఆమె ఒక్కో సినిమాకి ఏకంగా నాలుగు కోట్ల రూపాయల పారితోషకం అందుకుంటుంది.కానీ కాంతారా సినిమాకి వస్తే ఈ సినిమాలో ఎవరికీ ఎక్కువగా పారితోషం ఇవ్వలేదు.
చివరికి అన్ని విషయాలు తన భుజాలపైన మోసిన రిషబ్ కూడా చాలా తక్కువ పారితోషకమే తీసుకున్నాడు.
ఇక హీరోయిన్ సప్తమి అయితే కేవలం 50 లక్షల తో సరిపెట్టుకుంది.ఇలాంటి సమయంలో అంత తక్కువ రెమ్యూనరేషన్ కి రష్మిక నటించడానికి సిద్ధంగా లేకపోవడం కూడా ఒక కారణం.
"""/"/
H3 Class=subheader-styleడి గ్లామర్ పాత్ర/h3p
ఇప్పటికే పుష్ప సినిమాలో డి గ్లామర్ పాత్రలో నటించి రష్మిక ఒక సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది.
ఈ సినిమా తర్వాత పుష్ప సీక్వెల్ కూడా రాబోతుంది.అందులో కూడా ఆమె డి గ్లామర్ పాత్రలో నటిస్తుంది.
ఇలాంటి ఒక సందర్భంలో కాంతారా సినిమాలో కూడా ఆమె పల్లెటూరి పాత్రలో నటిస్తే రష్మిక కు ఎక్కువగా భవిష్యత్తులో అవే పాత్రలు వస్తాయనే భయంతో కాంతారా లో హీరోయిన్ పాత్ర చేయడానికి రష్మిక మందాన నో చెప్పింది.
"""/"/
H3 Class=subheader-styleరిషబ్ శెట్టి స్నేహితుడు/h3p
రిషబ్ శెట్టి కిరిక్ పార్టీ సినిమా ద్వారా రష్మిక కన్నడ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.
రష్మిక ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి గల కారణం రిషబ్ శెట్టి.
అయితే కిరిక్ పార్టీ సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో రష్మిక ప్రేమలో పడి, ఎంగేజ్మెంట్ చేసుకొని ఆ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే రక్షిత్ మరియు రిషబ్ మంచి స్నేహితులు కావడంతో వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని రష్మిక భావించి ఉంటుంది.
అందుకే కాంతారా వంటి ఒక గొప్ప సినిమాను ఆమె వదిలేసుకుంది.
ఒంటరిగా ఉన్నావా బాబూ.. స్కామర్‌తో ఆడేసుకున్న వాయిస్ ఆర్టిస్ట్.. వీడియో చూస్తే నవ్వాగదు..