ఆ సినిమాల విషయంలో రానా ఎందుకు సైలెంట్ అయ్యాడు..
TeluguStop.com
తెలుగు సినిమా సత్తా ప్రపంచ వ్యాప్తంగా తెలిసి వచ్చేలా చేసిన సినిమా బాహుబలి.
ఈ సినిమా తర్వాత టాలీవుడ్ క్రేజ్ బాగా పెరిగింది.ఈ సినిమా మూలంగా ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమాల మార్కెట్ భారీగా పెరిగింది.
అటు ఈ సినిమాకు బాలీవుడ్ లో క్రేజ్ అనుకున్న దానికంటే ఎక్కువ రావడానికి కారణం కరణ్ జోహార్ తో పాటు రానా అని కూడా చెప్పుకోవచ్చు.
అప్పటికే పలు బాలీవుడ్ సినిమాల్లో రానా నటించాడు.ఈ నేపథ్యంలోనే కరణ్ జోహార్ బాహుబలికి నార్త్ లో అండగా నిలిచాడు.
ఈ సినిమాకు దేశ వ్యాప్తంగా క్రేజ్ రావడంలో కీ రోల్ ప్లే చేశాడు.
ఆ తర్వాత కరణ్ జోహార్ కు చెందిన కొన్ని సినిమాలకు రానా అండగా ఉన్నాడు.
ఎప్పుడూ తన సినిమా ప్రచారాల్లో ముందుండే రానా ప్రస్తుతం అస్సలు కనిపించడం లేదు.
కనీసం తన సినిమాలకు సంబంధించిన ట్వీట్లు కూడా చేయడం లేదు.ఉన్నట్టుండి ఆయన ఎందుకు మౌనం ప్రదర్శిస్తున్నాడు అనేది ప్రస్తుతం సస్సెన్స్ గా మారింది.
రానా నంటిచిన రెండు సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి.అందులో వేణు ఊడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం ఒకటి.
సురేష్ బాబుతో కలిసి సుధాకర్ చేకూరి ఈ సినిమాని నిర్మించారు.నైంటీస్ లో ఉత్తర తెలంగాణలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా నక్సలిజం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
"""/" /
ఈ సినిమా మొదలైన నాటి నుంచే మంచి క్రేజ్ సంపాదించుకుంది.
అందుకు అనుగుణంగానే ఈ సినిమాను గత ఏడాది ఏప్రిల్ 31న విడుదల చేస్తామని అఫీషియల్ ప్రకటన చేశారు.
కానీ ఇప్పటి వరకు ఆ సినిమా విడుదల ముచ్చటే లేదు.కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేస్తున్నారని, ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయనే టాక్ నడిచింది.
ఈ వార్తలపై రానా గానీ, దర్శకుడు వేణు గానీ స్పందించలేదు. """/" /
అటు పవన్ కల్యాణ్ తో కలిసి భీమ్లా నాయక్ అనే సినిమాలో నటించాడు రానా.
ఈ సినిమా కూడా రిలీజ్ కు రెడీగా ఉంది.ఏపీలో టికెట్ల ధరల లొల్లి, థర్డ్ వేవ్ కారణంగా ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది.
ఈ సినిమా ప్రచార చిత్రాల్లోనూ రానా పేరు వినిపించడం లేదు.వీటిని పక్కన పెట్టి నెట్ ఫ్లిక్స్ కోసం తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ పనుల్లో మునిగిపోయాడు రానా.
ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ గురించి తప్ప విరాట పర్వం, భీమ్లా నాయక్ సినిమాల గురించి రానా నోరు విప్పడం లేదు.
కారణాలు ఏంటో కూడా తెలియదు.
సంక్రాంతికి కచ్చితంగా అరిసెలు ఎందుకు తినాలి..?