ఉద్యోగం ఇస్తా కానీ సినిమా ఛాన్స్ ఇవ్వను అంటూ వర్మకు చెప్పినా రామోజీరావు

శివ సినిమా తీయడానికి ముందు రాంగోపాల్ వర్మ చాలా రోజులుగా సినిమా డైరెక్షన్ చేయాలని తాతలాడిపోతున్నాడు.

అందుకే ఒక సినిమా కథను సిద్ధం చేసుకుని రెడీగా పెట్టుకొని ఆ సమయంలో ప్రతిఘటన, మయూరి, శ్రీవారికి ప్రేమలేఖ వంటి సినిమాలు తీసి విజయవంతంగా ప్రొడక్షన్ కంపెనీ నిర్వహిస్తున్న రామోజీరావుని కలవాలని అనుకున్నాడు.

శివ సినిమా మొదలు అవ్వడానికి కొన్ని నెలల ముందు ఈ సంఘటన జరిగింది.

అయితే ఆ సమయంలో రామోజీరావు అపాయింట్మెంట్ దొరకడం అంటే దాదాపు అసాధ్యం అనే పరిస్థితి ఉండేది.

కానీ అలా అసాధ్యం అని తెలిసి వదిలేస్తే అతడు రాంగోపాల్ వర్మ ఎందుకు అవుతాడు.

అందుకే ఒక కిల్లింగ్ ఆలోచన చేశాడు.అప్పట్లో రామోజీరావును ఎవరైనా కలవాలంటే ఆ వ్యక్తికి ఉన్న కెపాసిటీ మొత్తం ఏదైనా ఒక పేపర్లో న్యూస్ ఆర్టికల్ లాగా వస్తే ఆయన కలవడానికి అవకాశం ఇచ్చేవారు.

"""/"/ ఈ విషయం బాగా ఎక్కించుకున్న వర్మ రామోజీరావు గ్రూపుకు చెందిన న్యూస్ టైం అనే పత్రికకు రామోజీరావు దృష్టిని ఆకర్షించడానికి వర్మ ఐడియా దట్ కిల్డ్ 30 మిలియన్ పీపుల్ అనే ఒక శీర్షిక రాసి పంపించాడు.

వర్మ రాసిన కథ సదురు ఎడిటర్కు బాగా నచ్చడంతో ప్రచురించాడు.దాంతో రామోజీరావు అపాయింట్మెంట్ దొరకడం బాగా సులువు అయిపోయింది వర్మకు.

అప్పటికే సిద్ధంగా చేసుకున్న రాత్రి అనే సినిమా కథను తీసుకొని వెళ్లి రామోజీరావును కలిశాడు.

అసలు ఎవరు ఊహించని విధంగా ఆ చిత్ర విచిత్రమైన హారర్ సీన్స్ అన్నీ కలిపి రామోజీరావుని ఇంప్రెస్ చేయడానికి చాలా విజువలైజ్డ్ చెప్పినప్పటికీ రామోజీరావు మాత్రం దర్శకత్వం చేయడానికి అవకాశం ఇవ్వడానికి ఒప్పుకోలేదు.

"""/"/ ఎందుకంటే అప్పటివరకు వర్మకి అసలు షూటింగ్ ఎలా చేస్తారో కూడా తెలియదు కేవలం కథ రాసుకొని వచ్చి కళ్ళ ముందు పెట్టగలిగాడు కానీ ఎలాంటి అనుభవం లేకపోవడంతో పైగా అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేయకపోవడంతో రామోజీరావు తిరస్కరించాడు.

కథలు బాగా రాస్తున్నావు కాబట్టి నా పత్రికలో కాలమిస్ట్ గా జాబ్ ఇస్తాను కానీ డైరెక్షన్ జాబ్ మాత్రం ఇవ్వనంటూ కరాకండిగా చెప్పాడు రామోజీ రావు.

సినిమా తీయాలంటే విజువలైజేషన్ బాగుంటే సరిపోతుందని టెక్నీషియన్స్ కి అనుభవం ఉంటే చాలని వర్మ చెప్పడానికి ప్రయత్నించిన ఆయన ఒప్పుకోలేదు.

దాంతో వర్మ కి కోపం వచ్చి నీ జాబ్ నాకు అక్కర్లేదు అంటూ అక్కడ నుంచి వచ్చేసాడట.

తల్లి కూరగాయల వ్యాపారి.. సీఏ పాసైన కొడుకు.. ఈ యువకుడి సక్సెస్ కు వావ్ అనాల్సిందే!