ఈనాడుకే కాదు ఉదయం పత్రిక ఏర్పాటుకు కూడా ఆ ఒక్కరే కారణం..

ఉదయం దినపత్రికను 1984, డిసెంబర్‌ 29న ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత దాసరి నారాయణరావు( Dasari Narayana Rao ) ప్రారంభించారు.

ఈ పత్రిక వార్షికోత్సవం ఇటీవలే జరిగింది.1974లో ప్రారంభమైన ఈనాడుకు ఉదయం పత్రిక చాలా పోటీ ఇచ్చేది.

ఒకానొక సమయంలో ఈనాడు కంటే ఎక్కువ పాపులారిటీతో పాఠకులను ఆకర్షించింది.అయితే ఈ పోటీ పత్రిక మొదలు కావడానికి ఈనాడు అధినేత రామోజీ రావే కారణమంటే మీరు నమ్ముతారా.

ఉదయం పత్రిక( Morning Magazine ) అబద్ధాలు ప్రజల్లోకి వెళ్లకుండా నిజాలను ధైర్యంగా రాసేది.

వాస్తవాలను ధైర్యంగా జనం ముందుంచేది.ఎన్టీ రామారావు సీఎం గా గెలిచిన విజయ ఫలితాలతోనే ఉదయం మొదటి సంచిక విడుదల అయ్యింది.

ఈ పత్రిక ఏర్పడడానికి రామోజీరావు దురుసు ప్రవర్తనే కారణమని చెబుతుంటారు.అప్పట్లో ఈనాడులో ఏబీకే ప్రసాద్‌ ( ABK Prasad )ఎడిటర్‌గా పనిచేసేవారు.

అయితే రామోజీరావుకి, దాసరి నారాయణ రావు కి ఇద్దరికీ పడేది కాదు.అందువల్ల ఈనాడులో దాసరి నారాయణరావు పేరు గానీ, లేదంటే ఫోటో గానీ రాకుండా ఆదేశాలు ఇచ్చేవాడు.

అందువల్ల ఎడిటర్ దాసరికి సంబంధించిన పేరు, ఫోటోలు తీసేసుకోవాల్సి వచ్చేది. """/" / ఇంకా రామోజీరావు పెట్టిన రూల్స్ వల్ల ఎడిటర్ ప్రసాద్ మనసు ఎంతో గాయపడింది.

అలాంటి సమయంలోనే దాసరిని ఒకసారి కలిశారు.పాత్రికేయం గురించి మాట్లాడుకున్నారు.

చివరికి ఉదయం పత్రిక స్థాపించాలనే ఆలోచనకు వచ్చారు.అలా ఉదయం పత్రిక స్థాపన జరిగింది.

ఈ విధంగా చూసుకుంటే ఉదయం పత్రిక ఏర్పాటుకు రామోజీరావు ( Ramoji Rao )కారణమయ్యారని చెప్పుకోవచ్చు.

అంతకుముందు ఆయన స్థాపించిన ఈనాడు పాత్రికేయ రంగంలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.

ట్రెడిషనల్ జర్నలిజం రూల్స్ బ్రేక్ చేసి ప్రజల ఆశలకు ప్రతిరూపంగా మారింది. """/" / కానీ ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకే సపోర్ట్ చేస్తూ ఒక కరపత్రం గా మారి జర్నలిజం విలువలను తుంగలోకి తొక్కింది.

ఒక వర్గానికి సపోర్ట్ చేస్తూ మిగతా వర్గానికి చెందిన నాయకుల పట్ల వివక్ష చూపించింది.

వారి పేర్లు రాయకుండా వారి గురించి అసలు ఎలాంటి కథనాలు ప్రచురించకుండా నడుచుకుంది.

ఆ సమయంలో ఉదయం పత్రిక వారి గొంతుకయ్యింది.అసాధారణమైన టాలెంటు ఉన్న రిపోర్టర్లు, ఎడిటర్లు, జర్నలిస్టులు ఉండటం వల్లే ఉదయం పత్రిక బాగా సక్సెస్ అయ్యింది.

అప్పట్లో ఈ పత్రికలోని జర్నలిస్టులు అక్రమాలపై రాసిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం రిపోర్టులు తెగ పాపులర్ అయ్యాయి.

ఆర్థిక ఇబ్బందులు, కార్మిక సమస్యల వల్ల ఇలాంటి ఒక గొప్ప పత్రిక మూతపడాల్సి వచ్చింది.

డస్ట్ అలెర్జీ తో బాధపడుతున్నారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!