వర్మకి మెగా ఫ్యామిలీ అంటే అందుకే కోపమా..?
TeluguStop.com
రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) కి మెగా ఫ్యామిలీ అంటే ఎందుకు నచ్చదు అనే న్యూస్ నెట్లో తెగ వైరల్ అవుతుంది.
నిజానికి వర్మ మొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ కి వ్యతిరేకంగా కామెంట్లు చేస్తూ ఉంటాడు.
అలాగే ట్వీట్లు పెడుతూ ఉంటాడు.అయితే వర్మ కి, మెగా ఫ్యామిలీ కి మధ్య గొడవ ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు.
ఇక వర్మ కి ఆంధ్రప్రదేశ్ సిఎం అయిన జగన్ మంచి స్నేహితుడు కావడం తో చంద్రబాబు ను, పవన్ కళ్యాణ్ ని డీ గ్రేడ్ చేస్తూ సినిమాలు చేస్తూ ఉంటాడు అందులో జగన్ ని మాత్రం చాలా బాగా చూపిస్తాడు దానికి జగన్ నుంచి వర్మ కి పెద్ద మొత్తం లో మని కూడా వస్తుంది అనేది అందరికీ తెలిసిందే.
"""/" /
అయితే వర్మ కి, మెగా ఫ్యామిలీ అంటే ఎందుకు కోపం అంటే వర్మ చిరంజీవి తో చేసే సినిమా మధ్యలో వదిలేసి వర్మ ముంబై వెళ్ళిపోయి అక్కడ సినిమా తీశాడు దాంతో చిరంజీవి కోపం తో వర్మ ని పక్కన పెట్టేశాడు.
ఇక అప్పటి నుంచి వర్మ చిరంజీవి తో సినిమా చేయాలని చాలా ట్రై చేసినప్పటికీ చిరంజీవి ఆయన కి మళ్ళీ ఛాన్స్ ఇవ్వలేదు.
దాంతో అప్పటి నుంచి చిరంజీవి( Chiranjeevi ) మీద కోపం తో ఉన్న వర్మ ప్రతి విషయం లో చిరంజీవి ని మెగా ఫ్యామిలీ ని విమర్శిస్తూ ఉంటాడు.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్( Pawan Kalyan ) లో ఉన్నాడు కాబట్టి ఆయనని తక్కువ చేసి మాట్లాడితే వైసీపీ ప్రభుత్వము వాళ్ళకి ఫుల్ గా డబ్బులు కూడా ఇస్తుంది.
అందుకే ఆయన విపరీతం గా మెగా ఫ్యామిలీ మీద రెచ్చిపోయి మరి మాట్లాడుతూ ఉంటాడు.
"""/" /
ఇక ఈయన ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లని బేస్ చేసి తీసిన వ్యూహం సినిమా కూడా వీళ్ళ కి వ్యతిరేకం గా ఉంటూనే జగన్ కి సపోర్ట్ చేసేలా ఉంటుంది అనేది ఆ సినిమా ట్రెయిలర్ చూస్తేనే మనకి అర్థం అవుతుంది.
ఇక ఇలాంటి సినిమాలు తీయడం వల్ల వర్మ చేసే సినిమాలని జనాలు నమ్మడం లేదు ఆయన ఒక పార్టీ ని మాత్రమే హైలెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నాడు అనే విషయం జనాలకి తెలిసిపోయింది.
ఏఎన్నార్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను షూట్ మధ్యలోనే ఆపాలనుకున్నారా.. ఏమైందంటే?