ఆ సన్నివేశం నచ్చలేదని.. బాలకృష్ణ సినిమా నుంచి తప్పుకున్న రాశి.. చేసి ఉంటే మరోలా ఉండేది?

ప్రస్తుతం యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నందమూరి బాలకృష్ణ ఒకప్పుడు ఫ్యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేవారు.

రాయలసీమ లో ఉండే పగలు ప్రతీకారాల నేపథ్యంలో తెరకెక్కె సినిమాలో బాలకృష్ణ ఇట్టే ఒదిగిపోయి నటించారు.

ముఖ్యంగా బాలకృష్ణ బి.గోపాల్ కాంబినేషన్ అంటే అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయమని ప్రేక్షకులు నమ్మేవారు.

ఈ హిట్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం సమరసింహారెడ్డి.ఇక ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ సరసన సిమ్రాన్ నటించింది.

ఇక ఈ సినిమాకు మణిశర్మ అందించిన పాటలు ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి అని చెప్పాలి.

అయితే ఇక ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాను స్టార్ హీరోయిన్ గా ఉన్న రాశి వదులుకుందట.

అదికూడా ఒక సన్నివేశం కారణంగా ఇక ఈ సినిమాలో నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో సిమ్రాన్ కూ బదులు రాసిని తీసుకోవాలని అనుకున్నారట.అయితే రాసి కూడా ఈ సినిమా చేసేందుకు ఒప్పుకుంది.

సినిమాలో ఒక సన్నివేశం పై కాస్త అభ్యంతరం వ్యక్తం చేసిందట రాసి.ఆ సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగిస్తే తనకు సినిమా చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు అంటూ తెలిపిందట.

ఇంతకీ అసలు సీన్ ఏంటి అంటారా.అదేంటో కాదు నడుముపై సీతాకోక చిలుక వాలే సన్నీవేషం.

ఈ సన్నివేశం తొలగించడం కుదరదు అని చెప్పడంతో చివరికి ఈ సినిమా నుంచి తప్పుకుందట.

దీంతో ఇక రాశి స్థానంలో సిమ్రాన్ ను ఎంపిక చేశారు.అయితే పాత్రకు అవసరమైతే అందాల ఆరబోత బాగానే ఉంటుంది.

కానీ మితిమీరిన ఎక్స్పోజింగ్ చేయడం బాగుండదు అంటూ రాసి అప్పట్లో ఈ సినిమా పై ఆ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది.

"""/"/ సమరసింహా రెడ్డి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 16 కోట్ల వసూలు సాధించింది.అంతేకాదు 365 రోజులు కూడా ఆడి సౌత్ ఇండస్ట్రీ చూపు మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ వైపు వచ్చేలా చేసింది సమరసింహా రెడ్డి సినిమా.

ఆయన 25ఏళ్ల కష్టమే ఎక్స్‌పీరియం పార్క్‌: మెగాస్టార్ చిరంజీవి