R. Narayana Murthy : ఆర్.నారాయణమూర్తి కోపంతో ఒకేసారి లిక్కర్ బాటిల్ ఎత్తేశాడు..ఎందుకో తెలుసా ?

ప్రజల్లో చైతన్యం రగిలించడానికి విప్లవ సినిమాలు తీస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు ఆర్.

నారాయణ మూర్తి( R.Narayana Murthy ).

ఎర్రసైన్యం, చీమలదండు, వీర తెలంగాణ, పోరు తెలంగాణ వంటి సినిమాలను అద్భుతంగా తెరకెక్కించడమే గాక వాటిలో నటుడిగా కనిపించి అలరించాడు.

తన భావాలను సినిమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తూ వారిని ఎంతో మెప్పించాడు.ఆర్.

నారాయణమూర్తి ఇతర దర్శకులకు చాలా భిన్నంగా ఉంటాడు.నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ హిట్లు సాధిస్తూ కోట్ల ఆస్తి సంపాదించినా ఎప్పుడూ ఒక్క కారు కొనుక్కోలేదు.

అంతేకాదు తనకంటూ మంచి ఇల్లు కూడా కూడా నిర్మించుకోలేదు.చివరికి పెళ్లి కూడా చేసుకోకుండా ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడు.

తాజాగా ఇలాంటి గొప్ప దర్శకుడు, నటుడు గురించి రైటర్, డైరెక్టర్ కనగాల జయకుమార్ ఒక ఆసక్తికర విషయం పంచుకున్నాడు.

"""/" / డైరెక్టర్ జయకుమార్( Director Jayakumar ) మాట్లాడుతూ.దాసరి నారాయణరావు భార్య దాసరి పద్మ( Dasari Padma ) ఆర్.

నారాయణమూర్తికి బంధువు అవుతారని తెలిపారు.అందువల్ల దాసరి నారాయణరావుతో ఆర్.

నారాయణమూర్తి ఎప్పుడూ చాలా క్లోజ్ గా ఉండేవారని చెప్పుకొచ్చారు.ఆయన సలహాతోనే నారాయణమూర్తి డిగ్రీ కూడా పూర్తి చేశారని వెల్లడించారు.

అయితే ఒక రోజు దాసరి వద్ద పనిచేసే సాంబశివరావు నారాయణమూర్తిని రెచ్చగొట్టాడని జయకుమార్ తెలిపాడు.

"""/" / ఏ విషయంలో రెచ్చగొట్టాడని ఇంటర్వ్యూయర్ అడగగా.జయకుమార్ సమాధానం ఇస్తూ.

"ఒక రోజు సాయంత్రం వేళ దాసరి వద్దకు ఆర్.నారాయణమూర్తి వెళ్లారు.

ఆ సమయంలో అతని దగ్గర పనిచేసే వారితో పాటు సాంబశివరావు డ్రింక్ చేస్తున్నాడు.

నారాయణమూర్తిని చూసి ఒక పెగ్గు ఆల్కహాల్ తాగాలని మొదట సాంబశివరావు అడిగాడు.కానీ తనకు అసలు మందు అలవాటు లేదని సున్నితంగా నారాయణరావు తిరస్కరించాడు.

దాంతో సాంబశివరావు నువ్వసలు మగాడివేనా, మందు తాగలేవా అని రెచ్చగొట్టాడు.ఆ మాట అనడంతో ఆర్.

నారాయణమూర్తికి బాగా కోపం వచ్చింది.అంతే, వెంటనే పక్కనే ఉన్న బాటిల్ తీసుకొని సగం వరకు రా ఆల్కహాల్ కొట్టేశాడు.

ఆ తర్వాత తన రూమ్‌కి వచ్చి గోడం పట్టుకుని అలానే కింద పడిపోయాడు.

" అని చెప్పుకొచ్చాడు.

సీఎం పదవి పై మనసులో కోరిక బయటపెట్టిన పవన్.. ఏమన్నారోతెలుసా?