మంచి పనులకు ముందుగా కుడి పాదాన్ని ఎందుకు పెట్టాలి?
TeluguStop.com
పెళ్లి అయ్యాక నూతన వధువు అత్తవారింటిలో వరుడుతో కలిసి ఇంటిలో అడుగు పెట్టేటప్పుడు కుడి పాదం పెట్టి అడుగు వేయమని మన పెద్దవారు చెప్పటం మనం చూస్తూనే ఉంటాం.
కుడి పాదంతో ఇంటిలో అడుగు పెడితే సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
ఈ కారణంగానే ఇది తర తరాలుగా ఒక ఆచారంగా వస్తోంది.ఇక కేవలం అత్త వారింటికి కోడలు వచ్చే విషయంలోనే కాదు.
ఎవరి బాగు కోరతామో వారి ఇంటికి కుడిపాదాన్ని మోపుతూ ప్రవేశించాలని అంటారు.కుడి పాదం మోపకుండా ఎడమ పాదం మోపుతూ ప్రవేశించడం వలన అక్కడ గొడవలు రావటమే కాకుండా సంసారంలో సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి.
ఈ కారణంతోనే గొడవలకు వచ్చే వరకు ఎడమ పాదం మోపి మరీ లోపలకు వస్తారు.
ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఉదాహరణ చూద్దాం.సీత అన్వేషణలో భాగంగా హనుమంతుడు లంకానగరానికి చేరుకున్నప్పుడు ఈ విషయాన్ని గురించే కాసేపు ఆలోచించాడట.
తాను కుడిపాదం మోపుతూ లోపలికి ప్రవేశించడం వలన రావణాసురిడికి సకల శుభాలు జరుగుతాయని భావించి, ముందుగా ఎడమ పాదాన్ని మోపుతూ లోపలికి వెళ్లాడట.
కాబట్టి ఎక్కడైతే సఖ్యతను .సంతోషాన్ని .
సంపదను ఆశిస్తామో, అక్కడికి వెళ్ళినప్పుడు కుడి పాదం పెట్టి వెళ్లాలని శాస్త్రాలు చెపుతున్నాయి.