పూరి జగన్నాధ్ హీరో గా చేయాల్సిన ఆ సినిమాలు ఎవరి కోసం త్యాగం చేసాడు
TeluguStop.com
తెలుగు దర్శకుల్లో టాప్ లిస్టులో ఉంటాడు పూరీ జగన్నాథ్.ఎంతో మంది హీరోలను తన సినిమాల ద్వారా పరిచయం చేశారు.
సాదాసీదా హీరోలను సైతం టాప్ హీరోలుగా తీర్చిదిద్దాడు.హీరోయిజాన్ని కొట్టొచ్చినట్లు తీసే పూరీ.
పలు సూపర్ డూపర్ హిట్లను తెరకెక్కిచాడు.అలాంటి డైరెక్టర్‌కే ఓ వెరైటీ ఆఫర్ వచ్చింది.
తాను తీయబోయే సినిమాలో హీరోగా చేయాలని కోరాడు ఓ దర్శకుడు.అయితే ఆ డైరెక్టర్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఈ డైరెక్టర్ నో చెప్పాడట.
ఇంతకీ తనకు హీరోగా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ ఎవరు? ఆ సినిమా ఏంటి? పూరీ ఎందుకు నో చెప్పాడు? ఇప్పుడు తెలుసుకుందాం!
డీఎస్ కణ్ణన్.
రాజమౌళి, కృష్ణ వంశీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు.తనో సినిమా తీయాలి అనుకున్నాడు.
విశాఖ జిల్లా నర్సీపట్నం కేంద్రంగా సారాయి వీరరాజు అనే సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు.
ఈ సినిమాలో హీరోగా పూరీని పెట్టుకోవాలనుకున్నాడు.పూరీది కూడా విశాఖ జిల్లా కావడం, అదీ నర్సీపట్నానికి దగ్గరగా ఉండటం.
దాంతో పాటు ఆయనకున్న క్రేజ్‌ను వాడుకోవాలని భావించాడు.పూరీతో కూడా తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది.
వీటన్నింటి నేపథ్యంలో తన సినిమాలో హీరోగా చేయాలని రిక్వెస్ట్ చేశాడట కణ్ణన్.కణ్ణన్ ఆఫర్‌ను తిరస్కరించాడట పూరీ.
అదే సమయంలో తాను తీసిని రెండు పెద్ద సినిమాలు హిట్ కాకపోవడంతో పాటు నేనింతే సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా చేసి ఫైనాన్సియల్ గా లాస్ అయ్యాడు.
అప్పుడే కోలుకుంటూ డైరెక్టర్ గా ప్రేక్షకుల ఆదరణ పొందుతున్నాడు.ఈ సమయంలో హీరోగా చేస్తే.
ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే.అనవసరంగా తన స్టేటస్‌ను తగ్గించుకోవడం ఎందుకు అని భావించాడట.
ఈ కారణంగా కణ్ణన్ అవకాశాన్ని కాదన్నాడట. """/"/
పూరీ నో చెప్పడంతో అజయ్ హీరోగా ఈ సినిమాను కణ్ణన్ తెరకెక్కించాడు.
ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది.మొత్తంగా తనకు హీరోగా వచ్చిన అవకాశాన్ని పూరీ వదులుకున్నాడు.
ఆ నిర్ణయం తనకు మంచే చేసిందంటాడు పూరీ జగన్నాథ్.
చంద్రబాబు క్లారిటీతో ఉన్నారా ? అందుకే ఆ స్టేట్మెంట్ ఇచ్చారా ?