జయచిత్ర కెరీర్ మొత్తంలో అదే బెస్ట్ క్యారెక్టర్.. దర్శకనిర్మాతలు బతిమిలాడి మరీ నటింపజేశారు..!
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీలో నటులు మంచి పేరు తెచ్చుకోవాలంటే వారికి మంచి క్యారెక్టర్లు దొరకాలి.
ఒక్క గొప్ప క్యారెక్టర్ దొరికి, అందులో బాగా నటిస్తే చాలు వారిని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు.
గొప్ప క్యారెక్టర్లే ఓ రేంజ్ లో వారిని నిలబెడతాయి.ఉదాహరణకి కట్టప్ప, భానుమతి, పశుపతి, రేలంగి మామయ్య లాంటివి నటీనటులకు ఎంత క్రేజీ తెచ్చి పెట్టాయో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.
సాధారణంగా యాక్టర్స్ ఇలాంటి పాత్రల కోసం ఎదురు చూస్తుంటారు.అయితే ఒక్కోసారి వారికి అనుకోకుండా అలాంటి పాత్రలు వస్తుంటాయి.
అవి వారికి బాగా సూట్ అవుతాయి.ఆ పాత్ర వారి కోసమే రాసారేమో అనిపించేంత గొప్పగా అవి ఉంటాయి.
అలాంటి ఒక మంచి క్యారెక్టర్ నటి జయచిత్రకు( Jaya Chitra ) అనుకోకుండా లభించింది.
ఆ వేషం ఆమె కెరీర్‌లోనే ప్రముఖంగా చెప్పుకో దగినదిగా నిలిచింది.ఆమె చేసిన క్యారెక్టర్ పేరు నాగమణి( Nagamani ).
వెంకటేష్, మీనా హీరో హీరోయిన్లుగా చేసిన అబ్బాయిగారు చిత్రంలో ఈ పాత్రను ఆమె పోషించింది దీనిని ఇ.
V.Satyanarayana ) డైరెక్ట్ చేశాడు.
రాశి మూవీస్ నరసింహారావు ( Rashi Movies Narasimha Rao )నిర్మించాడు అయితే ఈ సినిమాలో జయచిత్ర చేసిన పాత్ర బాగా హైలైట్ అయింది.
సోగ్గాడు (1975) సినిమాతో హీరోయిన్‌గా వెండి తెరపై తళుక్కుమన్న జయచిత్ర దానికంటే ముందు కోలీవుడ్ లో 40 సినిమాలకుపైగా యాక్ట్ చేసి బిజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.
తమిళంలో, తెలుగులో హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఈమె మెప్పించింది.నెగెటివ్ క్యారెక్టర్స్ చేయడం ఈమెకు అస్సలు ఇష్టం ఉండదు కానీ ‘అబ్బాయిగారు’ సినిమాలో మాత్రం నెగెటివ్ రోల్ చేయడానికి ఒప్పుకుంది.
"""/" /
నిర్మాత నరసింహారావు నాగమణి క్యారెక్టర్ కోసం జయచిత్రను సంప్రదించి ఈ క్యారెక్టర్ మీకు బాగా సూట్ అవుతుందని, తప్పకుండా చేయాల్సిందని కోరాడట.
కానీ జయచిత్ర నరసింహారావుతో కాదనలేక ఓకే అండీ చెప్పేసి ఆ తర్వాత దాని గురించి పూర్తిగా మర్చిపోయిందట.
మేకర్స్ ను కలవడం గానీ తిరిగి ఫోన్ చేయడం గానీ ఆమె చేయలేదట.
దాంతో చివరికి రామానాయుడు ఫోన్ చేసి మంచి క్యారెక్టర్ దీనిని నువ్వే తప్పకుండా చేయాలి అని రిక్వెస్ట్ చేశాడట.
కానీ అప్పుడు కూడా ఆమె ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేదట.చివరికి మురళీమోహన్ కూడా ఫోన్ చేసి నాగమణి క్యారెక్టర్ చేయాలని బాగా విజ్ఞప్తి చేయడంతో ఆమె ఈ క్యారెక్టర్ లో ఏదో గొప్పతనం ఉందని భావించి చేయడానికి ఒప్పుకుంది.
తర్వాత కథ విని క్లైమాక్స్ బాగా నచ్చేయడంతో ఆ పాత్రలో నటించింది. """/" /
సినిమా రిలీజ్ అయ్యాక అబ్బాయిగారు సినిమా( Abbaygaru Movie ) మొత్తానికి జయచిత్ర పాత్ర హైలెట్ అని సినీ క్రిటిక్స్ ప్రేక్షకులు ప్రశంసించడం స్టార్ట్ చేశారు.
ఈ సినిమా హిట్ కూడా కావడంతో ఆమెకు మరింత పేరు వచ్చింది.వాణిశ్రీ, జమున వంటి దిగ్గజ హీరోయిన్లు కూడా జయచిత్ర ఆ పాత్రలో కనబరిచిన ప్రదర్శనను మెచ్చుకున్నారు.
ఆ విధంగా అనుకోకుండా జయచిత్రను ఒక క్యారెక్టర్ వరించి ఆమెకు ఎంతో గుర్తింపును తెచ్చి పెట్టింది.
అనుదీప్ కె వి విశ్వక్ సేన్ కి సక్సెస్ ఇస్తాడా..?