తిట్లదండకంలో పడి లాజిక్ మిస్ అవుతున్న పోసాని.. ఏం చేస్తే బాగుంటుందంటే?

ఆన్‌లైన్ సినిమా టికెట్ విధానంపై జనసేనాని పవన్ కల్యాణ్ ఏపీలోని వైసీపీ ప్రభుత్వం, మంత్రులపై చేసిన విమర్శలకుగాను వైసీపీ నేతలు, మంత్రులు కౌంటర్ ఇచ్చారు.

కాగా, ఈ క్రమంలోనే సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణ మురళి మధ్యలో ఎంటరయ్యారు.

అలా పోసాని చేసిన వ్యాఖ్యలతో వైసీపీ నేతలు, పవన్ మధ్య ఉన్న లొల్లిని తన వైపునకు తిప్పుకున్నట్లు అయింది.

పోసాని కృష్ణమురళి ప్రెస్ మీట్ పెట్టి మరీ పవన్ కల్యాణ్ విమర్శల్లో అర్థం లేదని పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్‌పైన దూషణలు చేశారు.ప్రెస్‌మీట్‌లో పోసాని మాట్లాడుతూ వైసీపీ మంత్రి పేర్ని నానిని పవన్ కల్యాణ్ సన్నాసి అని సంబోధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉత్తముడిని పట్టుకుని అలా అనడం సరికాదని అంటూనే పోసాని పవన్ కల్యాణ్‌ను సైకో అనడంతో పాటు అతడి ఫ్యాన్స్ సైకో ఫ్యాన్స్ అని దూషించారు.

ఈ నేపథ్యంలో పేర్ని నాని అంటే గౌరవంతో పవన్ కల్యాణ్‌పై పోసాని తిట్లు షురూ చేసినట్లుగానే పవన్ కల్యా‌ణ్‌ను అభిమానించే వారు పోసానిపై తిట్ల దండకం స్టార్ట్ చేశారని కొందరు వాదిస్తున్నారు.

నిజానికి పోసాని కృష్ణమురళి తన పైన, తన కుటుంబ సభ్యులపైన కామెంట్స్ చేసే వారిపైన పోలీస్ స్టేషన్‌లో కంప్లయింట్ చేసి ఉండాల్సిందని, అలా కాకుండా తిట్ల దండకం ఎత్తుకోవడం వల్ల ప్రయోజనం ఏంటని మరి కొందరు అడుగుతున్నారు.

"""/"/ ఓ సెలబ్రిటీ అయి ఉండి ఇలా తిట్లు తిట్టడం వల్ల ప్రయోజనమేంటని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

సెలబ్రిటీగా మాత్రమే కాకుండా యాక్టర్‌గా, డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా అన్ని క్రాఫ్ట్స్‌లో పని చేసి సక్సెస్ అయిన పోసాని కృష్ణమురళి బాగా చదువుకున్న వ్యక్తి అయి ఉండి ఇలా తిట్ల పురాణం ఎత్తుకోవడం ఏంటని పలువురు అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే బూతుల పురాణంలోకి వెళ్లి పోసాని కృష్ణమరళి లాజిక్ మిస్ అవుతున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ తిట్ల పురాణానికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో మరి.

వైసీపీదే అధికారమని చెబుతున్న మరో సర్వే.. ఈ ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేదా?