60 సంవత్సరాలకి షష్టి పూర్తి చేయడానికి కారణం ఏమిటో తెలుసా?
TeluguStop.com
మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని ఆచారవ్యవహారాలను ఎంతో పద్ధతిగా పాటిస్తారు.ఈ ఈ క్రమంలోనే కొన్ని శుభ కార్యాలను కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు.
సాధారణంగా ఒక వ్యక్తి జీవితంలో వివాహ వేడుక ఒకసారి జరుగుతుంది.అయితే అది ఇక వయసులో ఉన్నప్పుడు జరిగే వేడుకను వివాహ వేడుక అంటారు.
అదే వేడుక అరవై సంవత్సరాలలో జరిగితే దానిని షష్టిపూర్తి అని చెబుతారు.మరి షష్టిపూర్తిని 60 కి మాత్రమే చేయడానికి కారణాలు ఏమిటి.
అనే విషయాలు చాలా మందికి తెలియదు.మరి షష్టిపూర్తి 60 సంవత్సరాలలోనే ఎందుకు చేసుకుంటారో ఇక్కడ తెలుసుకుందాం.
కృత, త్రేతా, ద్వాపర యుగాల్లో మానవ ఆయుర్దాయం 180 .అదే కలియుగానికి వచ్చేసరికి మానవుడి ఆయుష్షు 120 లకి పడిపోయింది.
అందుకే 60 సంవత్సరాలు పూర్తికాగానే షష్టిపూర్తి నిర్వహిస్తారు.60 సంవత్సరాలకు షష్టిపూర్తి ఎందుకు నిర్వహిస్తారు అనే విషయానికి వస్తే నారదుడు పుత్రులు 60 మంది యుద్ధంలోమరణించడం వల్ల శోకసంద్రంలో ఉన్న నారదుడికి విష్ణుమూర్తి వరమిస్తాడు.
నీ 60 మంది పుత్రులు ఈ కాల చక్రంలో నిరంతరం తిరుగుతూ ఉంటారని వరం ఇవ్వడం చేత మనకు తెలుగు సంవత్సరాలు 60 గా ఉన్నాయి.
ఈ క్రమంలోనే మనిషి 60 సంవత్సరాలకు చేరుకోగానే అతనికి ఈ లోక సంబంధ విషయాలు పూర్తయినట్లే.
మిగతా 60 సంవత్సరాలు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతో బ్రతకాలని ధర్మ శాస్త్రం చెబుతోంది.
"""/" /
ఇక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్విశతోత్తరి దశ అనే ప్రమాణంలో 120 సంవత్సరాలుగా సూచిస్తోంది.
ప్రభవ నామ సంవత్సరంతో తెలుగు సంవత్సరాలు మొదలయ్యి అక్షయతో ముగుస్తాయి.అదేవిధంగా మరలా ప్రభవ నామ సంవత్సరం మొదలవుతుంది.
కనుక మనిషి పుట్టినప్పటి నుంచి 60 సంవత్సరాలు వచ్చే సమయానికి అదే సంవత్సరం మొదలవుతుంది.
ఈ క్రమంలోనే ఈ 60 సంవత్సరాలు మానవుని ఆలోచనా శక్తి అమోఘంగా ఉంటుంది.
60 సంవత్సరాల తర్వాత తిరిగి వారి మొదటి దశకు అనగా చిన్న పిల్లల మనస్తత్వాన్ని కలిగి ఆలోచన పరిజ్ఞానం కాస్త తగ్గుతూ వస్తుంది.
అందుకే 60 సంవత్సరాలు దాటిన ప్రతి తండ్రిని తన కొడుకు కన్నబిడ్డల్లా చేసుకోవాలని శాస్త్రం చెబుతోంది.
ఈ క్రమంలోనే 60 సంవత్సరాల వయసులో తన బిడ్డలు, బంధువుల సమక్షంలో షష్టిపూర్తి కార్యక్రమాన్ని జరుపుకుంటారు.
ఈ నలుగురు స్టార్ హీరోల కోసం బాలీవుడ్ మేకర్స్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారా..?