టాలీవుడ్, మీడియా తో పాటు ప్రేక్షకులు కూడా మారాల్సిన అవసరం ఉందా ?

టాలీవుడ్ లో ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే అందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు.చనిపోయిన నటి నటులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అధికారిక లాంచనాలు చేయడం లేదని మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా గగ్గోలు పెడుతూ ఉంటుంది.

మా అసోసియేషన్ ప్రారంభమై ఎన్నేళ్లు గడుస్తున్న ఒక దిగ్గజ నటి చనిపోతే ఇంతలా అవమానించాలా అంటూ అందరూ కామెంట్స్ పెడుతూ ఉంటారు.

కానీ బ్రతికున్న వారికి మనం ఇచ్చిన గౌరవం మాత్రం ఏముంది చెప్పండి.ఎలా చూసుకున్నా సీనియర్స్ కి గౌరవం ఇవ్వడం ఎప్పుడో మానేశారు.

కేవలం సినిమా వాళ్ళను లేదా మీడియాను, ప్రభుత్వాన్ని దూషించడం తప్ప రెగ్యులర్ ప్రేక్షకులుగా మనం మాత్రం చేసింది ఏముంది.

"""/"/ ఒక మామూలు మనిషి చనిపోయిన సెలబ్రిటీ చనిపోయిన అంత్యక్రియలు అందరికీ ఒకేలా జరుగుతాయి.

అయితే కాస్త తెలిసిన లేదా చూసిన వ్యక్తులు గొప్పగా బ్రతికినవారు చనిపోతే గొప్పగా సాగనంపడం అనేది ప్రభుత్వం ఇవ్వాల్సిన కనీసం మర్యాద.

ఇక ఒక మనిషి చనిపోయిన వెంటనే అతడు ఏ కులం వ్యక్తి అని సెర్చ్ చేసే మనం ఇలాంటి కామెంట్స్ పెట్టడానికి అర్హులమేనా అని ఒక్కసారైనా ప్రశ్నించుకున్నారా ? ప్రేక్షకులు లేదా సామాన్య ప్రజలు వ్యవహరిస్తున్న తీరు మాత్రం మంచిదేనా? ఏ కులం వ్యక్తి అయిన అతడి గొప్పతనం కులం వల్ల తగ్గుతుందా లేదా పెరుగుతుందా ?.

"""/"/ మనం మారకుండా ప్రభుత్వాలు ఏదో చేయడం లేదని మాట్లాడే ముందు మనల్ని మనం ప్రశ్నించుకుంటే మంచిది.

మీడియా సంస్థలు సోషల్ మీడియా సంస్థలు ప్రతి విషయాన్ని వేలెత్తి చూపడం మాత్రమే కాదు ఒక వ్యక్తి చనిపోగానే శవం పైన పేలాలు ఏరుకున్నట్టు చరిత్రలు బయటకు తీస్తారు.

ఎవరి గొప్పతనం ఎలా ఉందో తెలుసుకునే ముందు ముందు మనం ఎంత కరెక్ట్ గా ఉన్నామో తెలుసుకోవాలి.

ఇకనైనా టాలీవుడ్ తో పాటు ప్రభుత్వాలు, సామాన్య ప్రేక్షకులు మీడియా సంస్థలు మార్చుకుంటే మంచిది.

చనిపోయిన వారికి కాస్త గౌరవం ఇవ్వండి కులం పేరుతో వెతుకులాట ఆపండి.అధికారిక లాంచనాల పేరుతో వారు ఏ స్థాయి నటులు గుర్తింపు ఇచ్చే పరిస్థితి రాకుండా చూసుకోండి.

కెమెరాకు చిక్కిన రాక్షస మొసలి లాంటి చేప.. వీడియో వైరల్..