చిన్నతనంలోనే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ ..కారణం ఏంటి..?
TeluguStop.com
తెలుగు చలన చిత్ర సీమలో ఒకప్పుడు చాలామంది అగ్రహీరోలు వాళ్ళకంటూ ఒక గుర్తింపు సంపాదించుకొని ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ ముందుకు నడుచుకుంటూ వెళ్లేవారు.
అలాంటి సందర్భంలో ఇండస్ట్రీకి వచ్చిన చిరంజీవి తనదైన మార్కుతో అందరినీ మైమరిపించే యాక్టింగ్ తో నవరసాలను పండిస్తూ ముందుకుసాగారు అలాంటి చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి అనిపించుకున్నాడు.
చిరంజీవి సినిమాల మీద సినిమాలు చేస్తూ హిట్స్ మీద హిట్స్ కొడుతూ సినిమా ఇండస్ట్రీలో బాద్షా గా వెలుగొందాడు.
అలాంటి సందర్భంలో తమ్ముడు నాగబాబు నీ ఇండస్ట్రీకి పరిచయం చేసినప్పటికీ అతనికి పెద్దగా గుర్తింపు రాలేదు.
దాంతో చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్ నీ ఇండస్ట్రీకి ఎలాగైనా రప్పించి స్టార్ హీరోని చేయాలని చిరంజీవి చాలా ఆరాటపడేవారు.
అలాంటి సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మాత్రం ఇంట్లో చాలా డల్లుగా కూర్చుని ఉండేవారంట తనకి ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉండడం వల్ల సన్యాసం తీసుకుందామని కూడా ప్రయత్నించారట.
పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత చదువు తనకు అబ్బదు అని తెలుసుకొని మరి మనం ఏం చేయగలం అని ఆలోచిస్తే అతని మైండ్ లోకి చాలా ప్రశ్నలు వచ్చాయంట.
అయితే చిరంజీవి వాటన్నింటికి పులిస్టాప్ పెట్టాలని పవన్ కళ్యాణ్ తో సినిమా చేయించాలని చాలా ఆరాటపడేవారు కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు.
దీంతో పవన్ కళ్యాణ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన ఆనంద్ సాయి తో కలిసి సన్యాసం కూడా తీసుకుందామని శ్రీశైలానికి బయల్దేరుదాం అని కూడా అనుకున్నారట.
ఇదంతా గమనించిన చిరంజీవి వీడు ఇలాగే ఉంటే పిచ్చోడు అయిపోతాడు అనుకొని జంధ్యాల శిష్యుడు అయిన ఈ వి వి సత్యనారాయణ గారి డైరెక్షన్ లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ నీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు.
అయితే అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా యావరేజ్ గా ఆడింది కానీ ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ చేసిన మార్షల్ ఆర్ట్స్ ఫీట్స్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా చేతులు మీది నుండి కార్లు వెళ్లే సీను నిజంగా చేశాడు అని తెలియడంతో అభిమానులు చాలా ఆనందపడ్డారు.
"""/"/
ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ బద్రి, ఖుషి, తొలిప్రేమ లాంటి సినిమాలతో పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు కానీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ కి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా పేరు చెప్తే మాత్రం కోపం వస్తుంది అంట ఎందుకంటే ఆ సినిమా స్టార్ట్ అవ్వక ముందు జరిగిన సంఘటనలు తలుచుకుంటే ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారికి కోపం వస్తుందని చెబుతూ ఉంటారు.
పవన్ కళ్యాణ్ కి ఖుషి సినిమా తర్వాత 10 సంవత్సరాల పాటు హిట్స్ లేకపోయినా స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తన క్రేజ్ ఇంకా తగ్గలేదని నిరూపించాడు అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అత్తారింటికి దారేది సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
జానీ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత సినిమా డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని పవన్ కళ్యాణ్ కి తెలియడంతో తను తీసుకున్న నాలుగు కోట్ల రెమ్యునరేషన్ ని ఆ సినిమా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ గారికి ఇచ్చి నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు ఆ డబ్బులు ఇచ్చేయమని చెప్పారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ తన ఫ్యాన్స్ కోరిక మేరకు అవకాశం దొరికిన ప్రతి సారి సినిమా చేస్తూ వస్తున్నారు ప్రస్తుతం పింక్ రీమేక్ అయిన వకీలు సాబ్ సినిమా చేస్తున్నారు.
దీని తర్వాత కూడా నాలుగైదు సినిమాలకి కమిటయ్యారు.
పుష్ప ది రూల్ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది.. బొమ్మ బ్లాక్ బస్టర్ కావడం మాత్రం పక్కా!