ప్రధాని నాటిన మొక్కలు పీకేస్తున్నారు.. కారణం అదే!

ఏ దేశంలో అయినా ఏ మతంలో అయినా భూమిని కాపాడుకోవాలనే ఉంటుంది.ఇంకా అలానే వాతావరణం కారణంగా నష్టపోయిన దేశాలలో పాకిస్థాన్ ఒకటి.

దీంతో అక్కడా ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ గత ఆదివారం దేశంలో అతి పెద్ద ట్రీ ప్లాంటేషన్ ప్రచారం మొదలుపెట్టారు.

అయితే అలా నాటిన మొక్కలను మతం పేరు చెప్పి యువకులు పీకేస్తున్నారు.ఇంకా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే ఆ వీడియో పోస్ట్ చేస్తూ '' పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ వారంతంలో ట్రీ ప్లాంటింగ్ నిర్వహించారు.

ఈ శ్రమను తీవ్రవాదులు ఇస్లాంకు వ్యతిరేకం అని ఆరోపిస్తున్నారు.వింతగా అనిపిస్తుంది.

అన్ని మతాలు భూమిని కాపాడుకోవాలనే చెప్తున్నాయి'' అని రాశారు.ఇంకా ఈ వీడియోకు 80 వేలకుపైగా వ్యూస్ దక్కాయి.

అయితే ఈ వీడియోకు మతంకు సంబంధం లేదని వారు అంత ప్రతిపక్ష పార్టీ అని అందుకే ఇలా చేస్తున్నారని ఓ లోకల్ టీవీలో చెప్పారు.

అయితే అక్కడ అడ్మినిస్ట్రేషన్ నాటిన 6వేల మొక్కలను పీకేశారు.దీంతో ఈ ఘటనపై ఆ ప్రాంతానికి చెందిన సీఎం ఆగ్రహం వ్యక్తం చేసి ఆలా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వైరల్ వీడియో: ఆడుతూ పాడుతూనే 184 మంది మృత్యువాత.. వైరల్ వీడియో