Vijay Deverakonda : బ్యాగ్రౌండ్ లేని హీరోల పట్ల ఇంత చిన్న చూపేందుకు..? స్టార్ హీరోలను టార్గెట్ చేయగలరా ?
TeluguStop.com
ఈ మధ్య విజయ్ దేవరకొండ( Vijay Deverakonda ) తన మీద ఆన్లైన్ లో జరుగుతున్న దాడి గురించి అందరి ముందు బాహాటంగా చెప్పుకున్నాడు.
తన పైన డబ్బులు ఇచ్చి మరి తప్పుడు వార్తలను వేస్తున్నారు అని, ఇదే పని ఒక స్టార్ హీరో లేదా పెద్ద హీరోల పైన చేయగలరా అనే సందేహం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తుంది.
కేవలం బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి చిన్నగా సినిమాలు చేసుకుంటూ ఒక స్థాయికి వచ్చిన విజయ్ మరియు నాని లాంటి హీరోలకు ఇది తప్పడం లేదు కాబట్టి.
కేవలం ట్రోల్ల్స్, నెగటివ్ వార్తలు మరియు సినిమాలపై పేక్ ప్రచారం వరకు అయితే చేయగలరు.
తాజాగా ఇలా చిన్న హీరోలపై, బ్యాగ్రౌండ్ లేని హీరోలపై దాడి చేస్తుంది డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్స్ కూడా.
వరల్డ్ ఫెమస్ లవర్ సినిమా ద్వారా నష్టపోయిన అభిషేక్ పిక్చర్స్( Abhishek Pictures ) విజయ్ దేవరకొండ పై దాడి ప్రారంభించింది.
"""/" /
తాము ఆ చిత్రం ద్వారా ఎనిమిది కోట్లు నష్టపోయామని, ఆ డబ్బును ఇవ్వండి అంటూ తమ సోషల్ మీడియా ఖాతా ద్వారా మెసేజ్ పెట్టారు సదరు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వారు.
అయితే ఎన్నో ఏళ్లుగా హిట్స్, ఫ్లాప్స్ ఇస్తున్న ఎంతో మంది హీరోలు ఉండగా, సొసైటీ కి ఎదో చేద్దాం అనుకుంటున్నా విజయ్ దేవరకొండను మాత్రం ఇలా అడగడం ఎంతవరకు కరెక్ట్.
విజయ్( Vijay Deverakonda ) సినిమాల ద్వారా డబ్బు వస్తుంది కాబట్టి ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేసి ఈ రోజు లాస్ మాత్రం ఆ హీరో పై నెట్టడం సబబేనా అంటూ అయన అభిమానులు వాదిస్తున్నారు.
పోనీ ఇలాగే ఎవరైన పెద్ద హీరో పైన ట్వీట్ చేసే దమ్ము మీలో ఉందా అని కూడా అడుగుతున్నారు.
చిన్న హీరోలు( Small Heroes ) కాబట్టి ఎన్ని మాట్లాడిన నడిచిపోతుందా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు.
"""/" /
మహేష్ బాబు నుంచి మెగాస్టార్( Megastar ) వరకు ఎందరో ఫ్లాప్స్ తీశారు.
వారి పైన ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేరు.కానీ ఇలా విజయ్ లాంటి హీరో అయితే ఎలా మాట్లాడతారు.
ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న దాడి కాదు.మొదటి నుంచి తన సొంత కాళ్లపై ఎదుగుతున్న విజయ్ దేవరకొండ పై చాల మంది హీరోలకు చిన్న చూపు ఉంది.
ప్రమాదంలో చేతిని కోల్పోయినా పతకాలు సాధించిన యువతి.. సక్సెస్ కు వావ్ అనాల్సిందే!