Sridevi :ముంబై హీరోయిన్స్ మాత్రమే ఎందుకు అంత స్పెషల్ !

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు చాలా ముఖ్యం.తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్ లనే ఎందుకు పెట్టుకోరు, ఎక్కువ ముంబై హీరోయిన్స్ ని ఎందుకు పెట్టుకుంటరు అనేది ముందు నుంచి ఉన్న పుకార్లే.

నిజానికి తెలుగు సినిమాల్లో ఎక్కువగా నాన్ తెలుగు హీరోయిన్స్ మాత్రమే కనిపిస్తుంటారు.ముంబై హీరోయిన్స్ ఎక్కువ కనిపిస్తారు అన్నది నిజమే.

అయితే ముంబై హీరోయిన్స్ నే ఎందుకు ఎక్కువగా తీసుకుంటారు అనేది ఇప్పుడు తేలుకుందాం.

నిజానికి అందరు ముంబై హీరోయిన్స్ అంటారు కానీ వారందరు ముంబై హీరోయిన్స్( Mumbai Heroines ) కాదు.

వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ముంబైలో ఉంటున్నవారు.ముంబై ప్రధాన కేంద్రం కాబట్టి అందరు ముంబైకి వచ్చి ఫ్యాషన్‌, మోడలింగ్, యాడ్ మేకింగ్ కోసం ముంబైకి వస్తారు.

ముంబైకి వచ్చి సినిమాల్లో ట్రై చేస్తుంటారు.ముంబై అనేది అడ్వాన్స్డ్ గా ఉంటుంది.

ఇక్కడ ఒక డిసిప్లిన్ ఉంటుంది.ఒక ప్రొఫెషనలిజం ఉంటుంది.

ఆడిషన్స్‌కు వచ్చే ముంబై అమ్మాయిలు ప్రొఫెషనల్స్ అంటే అతిశయోక్తికాదు.ప్రతిఒక్కరు అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉంటారు.

ఆడిషన్స్ జరిగినప్పుడు కచ్చితంగా సెలెక్ట్ కావాలని, వేరే విషయాలని పట్టించుకోకుండా మొత్తం ఫోకస్ ఆడిషన్ మీదే పెడతారు.

"""/" / అంతేకాదు బాడీ సెన్స్, యాక్టింగ్, గ్రూమింగ్ విషయంలో లక్షలు పెట్టి శిక్షణ తీసుకుంటారు.

ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటారు.అంటే తెలుగు వారిలో ఈ క్వాలిటీస్ ఉండవని కాదు, వాళ్లు ఎంత ప్రొఫెషనల్స్ అన్నదే పాయింట్.

ముంబై వల్లనే ఎక్కువ తీసుకుంటారు, వాళ్ళకే డబ్బులు ఎక్కువ ఇస్తారు అనేది ఒక పుకారు మాత్రమే.

నిజానికి ఆడిషన్ ఎవరు బాగా ఇస్తే వారినే ముందు సెలెక్ట్ చేసుకుంటారు, వారికే డబ్బు ఇవ్వడం కాదు టాలెంట్ ఉన్న వారి దగ్గరికి డబ్బు అదే వెళ్తుంది.

మన తెలుగు హీరోయిన్లు కూడా కొంత మంది హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లి జెండా ఎగురవేసిన వారున్నారు.

అప్పట్లో జయప్రద, శ్రీదేవి( Sridevi )లు ముంబై వెళ్లి సంచలనాలు సృష్టించారు.టాప్ హీరోల కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు.

ఇండస్ట్రీలో వారి మార్కెట్ ని బట్టి వారి రెమ్యూనిరేషన్( Remuneration ) ఉంటుంది.

అంతేకాని ముంబై హీరోయినా, తెలుగు హీరోయినా అని ఉండదు. """/" / ముఖ్యంగా మన తెలుగు హీరోయిన్లు కొన్ని సీన్లు ఉంటె ఆ సినిమా చేయడానికి ఇష్టపడరు.

చాలా కండిషన్స్ పెడుతుంటారు.ఒక లిప్ లాక్ సీన్ ఉంటె డైరెక్టర్ ఎంతో కన్విన్స్ చేస్తే కానీ ఆ సీన్ చేయరు.

అంతేకాదు హీరోయిన్ వాళ్ళ తల్లితండ్రులకు కూడా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు.అప్పుడే ఆ సీన్ ని చేస్తారు.

కానీ ముంబై హీరోయిన్లు సీన్లకి తగ్గట్టు అప్డేట్ అవుతుంటారు.ఆ సీన్ కి ఎంత అవసరం ఉంటుందో అంతవరకు మొహమాటం లేకుండా చేస్తారు.

ఇప్పుడు కొన్ని రోజుల నుంచి తెలుగులో ( Tollywood )కూడా కొన్ని బోల్డ్ సినిమాలు వస్తున్నాయి.

అయితే కొంత మంది తెలుగు హీరోయిన్లు కూడా మంచి క్యారెక్టర్ ఉంటె చేయడానికి ముందుకొస్తున్నారు.

అయితే త్వరలోనే మరికొంత మంది తెలుగు హీరోయిన్ లు ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యే అవకాశం ఉంది.

బ్రేక్ ఇన్స్పెక్టర్ పై తిరగబడ్డ లారీ డ్రైవర్లు.. వీడియో వైరల్