అలా వెళితే అరిష్టం అనే ఆచారం హిందూ సంప్రదాయంలో కొనసాగుతూ వస్తోంది.అసలు ఎందుకు అలా చేయాలి.
శ్రీకాళహస్తి దేవాలయాన్నే ఎందుకు చివరగా దర్శించుకోవాలి.శ్రీకాళహస్తి దర్శనం తరువాత మరో గుడికి ఎందుకు వెళ్లకూడదు.
వెళితే ఏమవుతుంది.నేరుగా ఇంటికే ఎందుకు వెళ్లాలి.
? తెలుసుకుందాం.పంచభూతాల నిలయం ఈ విశాల విశ్వం.
గాలి, నింగి, నేల, నీరు, నిప్పు ఇవే పంచభూతాలు.వీటికి ప్రతీకలుగా భూమి మీద పంచభూత లింగాలు వెలిసాయి.
అందులో ఒకటే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో వెలిసిన వాయులింగం.అయితే ఇక్కడి గాలి స్పరించిన తరువాత ఏ ఇతర దేవాలయాలకు వెళ్లకూడదనే ఆచారం.
అందులో నిజం లేకపోలేదు.సర్పదోషం.
రాహుకేతువుల దోషం ఇక్కడికి వచ్చాక పూర్తిగా నయమవుతుంది.శ్రీకాళహస్తిలోని సుబ్రమణ్య స్వామి దర్శనంతో సర్పదోషం తొలుగుతుంది.
ప్రత్యేక పూజలు చేసుకున్న తరువాత నేరుగా ఇంటికే చేరాలని చెపుతారు ఇక్కడి పూజారులు.
కారణం దోష నివారణ జరగాలంటే శ్రీకాళహస్తిలో పాపాలను వదిలేసి ఇంటికి వెళ్లడమే.తిరిగి ఏ ఇతర దేవాలయాలకు వెళ్లిన దోష నివారణ ఉండదని అక్కడి పూజరులు చెపుతున్నారు.