Om Raut Adipurush: నువ్వేమైనా కెవి రెడ్డి అనుకున్నావా ఓం రౌత్..నమ్మించలేక బుక్ అయ్యావ్ గా !
TeluguStop.com
రామాయణం లేదా మహా భరతం వంటి పురాణాలూ ఏమైనా సరే ఉన్నది ఉన్నట్టుగా తీస్తే డబ్బులు రావు.
కానక వర్షం కురవాలంటే కాస్త తిమ్మిని బమ్మిని చేయడం నేర్చుకోవాలి.కానీ ఏది చేసిన జనాలను కన్విన్స్ చేయగలగాలి.
తీసింది రామాయణం లేదా మహా భారతం అని జనాలు నమ్మాలి.ఉదాహరణకు మాయ బజార్.
( Maya Bazaar ) ఇది ఒక కల్పితం కానీ అది నిజమైన మహాభారత ఘట్టం అనేంత అందంగా సినిమా తీయడం మాత్రమే కాదు అప్పటికి ఇప్పటికి ఒక చెరిగిపోని చిత్రంగా ఆలా మిగిలిపోయింది.
ఈ సినిమాను తీసింది కదిరి వెంకట్ రెడ్డి అలియాస్ కెవి రెడ్డి.( KV Reddy ) """/" /
అంతెందుకు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి ముందు దాన వీర శూర కర్ణ ఆయనే నిర్మాతగా దర్శకుడిగా సినిమాలో రకరకాల పాత్రలు పోషించి సినిమాను విజయ మార్గాన నడిపింది డబ్బు సంపాదించడం తో పేరును కూడా సంపాయించుకున్నాడు.
ఇది అయన పొలిటికల్ ఎంట్రీ కి ఒక కర్టైన్ రైజర్ గా ఉపయోగపడింది.
ఈ చిత్రంలో ఎన్నో వక్రీకరణలు ఉన్నప్పటికీ లాభాలను ఆర్జించి ప్రేక్షకుల మనసు గెలిచింది.
అయితే కురుక్షేత యుద్దాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించడం వళ్ళ కురుక్షేత్ర యుద్ధ సినిమా గోరంగా ఫెయిల్ అయ్యింది.
ఈ సినిమాకు కమలాకర కామేశ్వర రావు దర్శకుడు.అందుకే ఉన్నది ఉన్నట్టు తీయడం పెద్ద నేరం అన్నట్టు ఎవరికీ నచ్చిన వక్రీకరణ వారు చేస్తూ వెళ్తున్నారు.
"""/" /
అయితే ఈ వక్రీకరణలు మనం మొదట్లో ఆపలేదు కాబట్టే ఈ రోజు ఓం రౌత్( Om Raut ) ఆదిపురుష్ సినిమా తో( Adipurush ) ఇంతటి దారుణానానికి ఒడి గట్టి ప్రభాస్ ని గొర్రె లాగ వాడుకున్నాడు.
రామాయణం కాస్త అయన చేతిలో బలయ్యింది.ఎక్కడి కెవి రెడ్డి ఎక్కడి ఓం రౌత్.
సినిమా ను ఎలాగైనా చూపించి జనాలను కన్విన్స్ చేయడం అనేది అందరికి సాధ్యం కాదు.
మాయాబజార్, దాన వీర శూర కర్ణ చూసారు ఇప్పుడు ఆదిపురుష్ ఎందుకు చూడరు అంటే ఎందుకు చూడాలి తీసింది ఓం రౌత్ అయినా రామ్ గోపాల్ వర్మ అయినా కథ కన్విన్సింగ్ ఉంటె తప్ప చూడరు.
చిన్న సినిమా బలగం ఎన్నిసార్లు వచ్చిన చూస్తారు మరి అలా ఒప్పించాలి ప్రేక్షకుడిని.
డైరెక్టర్ క్రిష్ రెండో పెళ్లి అంటూ జోరుగా ప్రచారం.. వైరల్ వార్తల్లో నిజమెంత?