ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ దూరం… అదే కారణమా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో సేవలు చేసినటువంటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswararao ) గురించి ఎంత చెప్పినా తక్కువే ఈయన హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.

ఇకపోతే అక్కినేని నాగేశ్వరరావు గారి శతజయంతి కావడంతో నాగార్జున అన్నపూర్ణ స్టూడియోలో పంచలోహాలతో తయారుచేసినటువంటి నాగేశ్వరరావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంతో ఈ శతజయంతి వేడుకలను ప్రారంభించారు.

ఇందులో భాగంగా ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఆహ్వానించడంతో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో సందడి చేశారు.

"""/" / మంచు విష్ణు నుంచి మొదలుకొని రాంచరణ్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.

ఇక నందమూరి కుటుంబానికి అక్కినేని కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది అనే విషయం మనకు తెలిసిందే.

ముఖ్యంగా ఎన్టీఆర్ ( NTR ) కి నాగార్జున( Nagarjuna ) కు విడదీయలేని బంధం ఉంది.

నాగార్జున ఎన్టీఆర్ ను తన పెద్ద కొడుకు అంటూ పలు సందర్భాలలో సంబోధించారు ఇక ఎన్టీఆర్ కూడా నాగార్జునని సార్ అని కాకుండా ఎంతో ఆప్యాయంగా బాబాయ్ అని పిలుస్తారు.

"""/" / ఇలా నాగార్జున ఎన్టీఆర్ మధ్య ఇంత మంచి అనుబంధం ఉన్నప్పటికీ నాగార్జున ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ ను ఆహ్వానించ లేదా ఒకవేళ ఆహ్వానం అందిన ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారా అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది.

అయితే ఎన్టీఆర్ గత కొద్దిరోజుల క్రితం దుబాయ్ కి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.

దుబాయ్ నుంచి సోమవారం హైదరాబాదు చేరుకున్నటువంటి ఎన్టీఆర్ మరుసటి రోజు నుంచి దేవర సినిమా( Devara Movie ) షూటింగ్ పనులలో బిజీ అయ్యారు.

ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలోనే ఈయన ఏఎన్ఆర్ శత జయంతి వేడుకలకు హాజరు కాలేకపోయారని తెలుస్తోంది.

ఇంతకుమించి ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడానికి కారణాలు ఏమీ లేవని చెప్పాలి.

గజిని2 విషయంలో అల్లు అరవింద్ రిస్క్ తీసుకుంటున్నారా.. అలా చేస్తే ఇబ్బందే!