బాల భారతం వంటి సినిమాలు తీయకుండా ఎన్టీఆర్ ని ఆపింది ఎవరు ?

బాల భారతం( Bala Bharatham ).ఈ సినిమా సంచలన విజయం సాధించడం అప్పట్లో చాలా పెద్ద విషయం.

తెలుగులో కమలాకర కామేశ్వరరావు ( Kamalakara Kameswara Rao )దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఎంతో మంది చిన్నారులను తొలిసారిగా తెలుగు తెరకు పరిచయం చేశారు.

తెలుగు వారు మాత్రమే కాదు కన్నడ భాష నుంచి కూడా కొంతమంది చిన్నారులను తీసుకొచ్చి ఈ సినిమాలో నటింపజేశారు.

ఈ సినిమాను విజయం సాధించిన తర్వాత అనేక భాషల్లోకి డబ్ చేశారు.చిన్నపిల్లలతో భారతం అనే పేరు వినగానే మొదట నవ్విన వారే ఆ తర్వాత చాలా బాగుంది అని కామెంట్స్ చేశారు.

పేరులోనే బాలా అని ఉండడంతో అదొక చిన్నపిల్లల సినిమాగా తీసిపారేసారు. """/" / ఈ సినిమాలో శ్రీదేవి ( Sridevi )ఒక ముఖ్యమైన పాత్రలో బాలనటిగా నటించింది.

అయితే కమలాకర కామేశ్వరరావు ఈ చిత్రాన్ని తీయాలనుకున్న సందర్భంలో ఆయన ఎంతో మంది చేత చీత్కరాలు ఎదుర్కొన్నారట.

అందరికీ తెలిసిన భారతాన్ని చిన్న పిల్లలతో తీస్తే ఎవరు చూస్తారు చెప్పండి అంటూ మొహం పైన నవ్వే వారట.

అయినా కూడా పంతం పట్టి ఈ చిత్రాన్ని అద్భుతంగా తీసి విజయవంతమయ్యారు దర్శకుడు.

ఈ సినిమా అఖిల బాల భారత్ పేరుతో హిందీలో కూడా విడుదలై విజయం సాధించింది.

ఇక తెలుగు ఇండస్ట్రీలోలో ఇప్పటికే నాలుగు సార్లు ఈ చిత్రం విడుదలై విడుదలైన ప్రతిసారి కాసుల వర్షం కురిపించింది.

"""/" / ఈ సినిమా టీవీలో వచ్చినా కూడా పిల్లలు ఛానల్ మార్చకుండా చూస్తారు.

అయితే నందమూరి తారక రామారావు సైతం బాలలతో ఈ చిత్రాన్ని నిర్మించాలని ముందే అనుకున్నప్పటికీ ఆయన సోదర త్రివిక్రమ రావు ఇలాంటి సినిమా విజయం సాధించదు అంటూ ఆయనను వారించారట దాంతో కమలాకర కామేశ్వరరావు తో వరుసగా రెండు సినిమాలు హీరోగా నటించిన ఎన్టీఆర్ ఆయన ఎంతగానో భారతం సినిమా మాత్రం తీయలేకపోయారు.

ఇక బాలలతో కాదని మామూలుగానే మహాభారతం పై ఎన్నో సినిమాలు తీసి విజయాలు సాధించారు అన్నగారు.

నిత్యం పాలు తాగ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారా?