NTR: ఆ డైరెక్టర్‌ను నమ్మించి మోసం చేసిన జూనియర్ ఎన్టీఆర్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతంగా నటించగల హీరోలలో జూ.ఎన్టీఆర్( Jr NTR ) ఒకడు.

ఈ హీరో ఆర్ఆర్ఆర్ సినిమాలో అద్భుతంగా నటించి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నాడు.ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల ఈ యంగ్ టైగర్ కెరీర్ తొలినాళ్లలో హిట్స్ తో సమానంగా ఫ్లాప్స్ కూడా అందుకున్నాడు.

నిజానికి ఈ హీరో చేసిన మూడు సినిమాలకు ఒకరే రచయిత కథను అందించాడు.

అతడే వక్కంతం వంశీ.( Vakkantham Vamsi ) 2006లో వంశీ అందించిన కథతో సురేందర్ రెడ్డి "అశోక్" సినిమా( Ashok Movie ) తీశాడు.

జూనియర్ ఎన్టీఆర్‌ హీరోగా చేసిన ఈ మూవీ యావరేజ్ హిట్‌గా నిలిచింది.తర్వాత కల్ట్‌ ఫిల్మ్‌గా పేరు తెచ్చుకుంది.

మళ్లీ 5 ఏళ్లకు అంటే 2011లో వంశీ అందించిన కథతోనే సురేందర్ రెడ్డి "ఊసరవెల్లి" సినిమా( Oosaravelli ) తీశాడు.

ఇందులోనూ తారక్ హీరోగా నటించాడు.ఈ మూవీ ఫస్ట్ డే రూ.

16.3 కోట్లు వసూలు చేసి హైయ్యెస్ట్ ఓపెనింగ్ డే గ్రాస్ రాబట్టిన సినిమాగా నిలిచి మునుపటి టాలీవుడ్ రికార్డులను బద్దలు కొట్టింది.

బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ గానూ నిలిచింది. """/" / ఆ తర్వాత ఎన్టీఆర్ కోసం వంశీ "టెంపర్" మూవీ( Temper Movie ) కథ రాసుకున్నాడు.

ఈ స్టోరీతో తానే సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం ఇవ్వాలని ఎన్టీఆర్ ని అడిగాడు.

నిజానికి జూ.ఎన్టీఆర్ కి వంశీ మొదటినుంచి మంచి స్నేహితుడిగా ఉంటూ వచ్చాడు.

అతడి కోసమే కథలు రాసుకున్నాడు.అయితే టెంపర్ మూవీ కథ విన్నప్పుడు ఎన్టీఆర్‌కి బాగా నచ్చేసింది.

కానీ ఆ స్టోరీతో వంశీ డైరెక్షన్ చేస్తానంటే మాత్రం ఒప్పుకోలేదు.ఆ కథతో పూరీ జగన్నాథ్( Puri Jagannath ) చేత సినిమా తీద్దామని వంశీకి చెప్పాడు.

అయితే పూరి జగన్నాథ్ వేరే వారి కథతో సినిమా తీయడానికి ఒప్పుకోనన్నాడు.తాను రాసిన కథతోనే సినిమా తీస్తానని పట్టుపట్టాడు.

కానీ ఎన్టీఆర్ వంశీని, పూరి జగన్నాథ్ ని ఒప్పించి మూవీని పూరీతోనే డైరెక్ట్ చేయించాడు.

ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. """/" / అనంతరం తారక్ వంశీకి ఓ హామీ ఇచ్చాడు.

కథ రాసుకొని వస్తే తన డైరెక్షన్‌లోనే తప్పకుండా సినిమా చేస్తానని వంశీకి మాట ఇచ్చాడు.

దాంతో ఖుషి అయిన సదరు రచయిత ఎన్టీఆర్ కోసం "నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా"( Naa Peru Surya Naa Illu India ) కథ రాసుకున్నాడు.

అది నచ్చకపోవడంతో ఎన్టీఆర్ మరో ఆలోచన లేకుండా రిజెక్ట్ చేశాడు.దీంతో చేసేదేమీ లేక అల్లు అర్జున్‌ను హీరోగా పెట్టి ఆ సినిమాను రూపొందించాడు.

ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఒకవేళ టెంపర్ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం వంశీకి ఇచ్చినట్లయితే అతడు తన తొలి సినిమాతోనే మంచి హిట్టు కొట్టేవాడు.

సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకునే వాడు కానీ ఎన్టీఆర్ ఆ అవకాశం ఇవ్వకుండా ఇతడికి అన్యాయం చేశాడని కొందరు విమర్శిస్తుంటారు.

వైరల్ వీడియో: రెప్పపాటులో ఆ పని కానిచ్చేసిన వరుడు..