వినాయకుడి పూజలో తులసీదళాలను ఎందుకు ఉపయోగించకూడదు..?

తులసి ఆకులు( Basil Leaves ) చాలా పవిత్రమైనవి.అందుకే ప్రతి దేవుడి ఆలయంలో తులసి మాలలతో అలంకరణ చేస్తూ ఉంటారు.

అలాగే తులసి మాలను వినాయకునికి ఎందుకు వాడరో, పురాణాలు ఏం చెబుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మనం ఎటువంటి పూజలను మొదలుపెట్టిన కూడా ముందుగా వినాయకుడి( Ganesha ) పూజలు చేస్తాము.

ఆయన ఆవాహన తర్వాతే ఏ పూజైనా ఏ పని అయినా ప్రారంభిస్తారు.ఏ పని చేపట్టిన విఘ్నాలు కలగకూడదని మొదటి పూజా ఆయనకు చేస్తారు.

బుధవారం రోజున వినాయకుని పూజ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.కష్టాలు దూరమైపోతాయి.

కార్యభంగం, జాప్యం లేకుండా ఉంటుందని ప్రజలు నమ్ముతారు.అలాగే ఆటంకాలు దూరమైపోయి ఇంట్లో ఐశ్వర్యం నిలిచి ఉంటుంది.

వినాయక పూజలో రకరకాల మోదకాలు సమర్పిస్తారు.అంతేకాకుండా వీటితోపాటు కుంకుమ, అక్షతలు, దర్బాలు, పువ్వులు, సుగంధద్రవ్యాలు, సింధూరం వంటివి అన్నీ గణేష్ పూజలో ఉపయోగిస్తారు.

కానీ తులసిని మాత్రం గణేష్ పూజకు ఉపయోగించరు.ఎందుకంటే తులసి దేవి అతని అందమైన రూపానికి ఆకర్షితురాలు అవుతుంది.

ఆమెకు గణేశుని వివాహం ఆడాలని కోరిక మనసులో కలిగింది.ఆమె మనసులోకి ఆ కోరిక వల్ల అతడికి తపోభంగం అయింది.

"""/" / తులసి వల్ల తన తపో భంగం జరిగిందని తెలుసుకొని తులసికి తను బ్రహ్మచారిని ఆమె కోరికను తిరస్కరించాడు.

ఆ తిరస్కారానికి ఆమెకు కోపం వచ్చి దీర్ఘకాలంగా బ్రహ్మచారిగా ఉండిపొమ్మని శపిస్తుంది.ఆ కారణంగా శాపానికి లోనైన వినాయకుడికి కూడా కోపం వచ్చి తులసిని అసురుడిని భర్తగా పొందుతావని, అతడి చెరలో ఉండిపోతావు అని శపిస్తాడు.

అప్పుడు తులసి క్షమించమని వేడుకుంటుంది.కానీ వినాయకుడు మాట వెనక్కి తీసుకోడు.

"""/" / గణేష్ శాపం వల్ల తులసికి చంకచూడుడనే రాక్షసుడుతో వివాహం జరుగుతుంది.

అతడికి కృష్ణ కవచం( Krishna Kavacham ) ఉందనే గర్వంతో లోక కంటకుడిగా మారి అందరిని బాధిస్తుంటాడు.

తులసి పాతివ్రత్య మహత్మ్యం లో అతన్ని సంహరించడం విష్ణుమూర్తికి సాధ్యం కాదు.వినాయకుడి సహాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి ఆ రాక్షసుడిని విష్ణుమూర్తి ( Lord Vishnu )సంహరిస్తాడు.

ఆ తర్వాత శ్రీహరి అనుగ్రహం వల్ల తులసి మొక్కగా అవతరిస్తుంది.తన పాతివ్రత్యా భంగానికి వినాయకుడు కారణమని తెలుసుకొని శిరస్సు లేకుండా జీవించమని తులసి శపిస్తుంది.

అందుకే వీరిద్దరి మధ్య వైరం ఉంటుంది.అందుకే వినాయక చవితి మినహాయించి ఎప్పుడు తులసి కనిపించదు.

జుట్టు రాలడం, చుండ్రు రెండింటికి చెక్ పెట్టే ముల్తానీ మట్టి.. ఎలా వాడాలంటే?