శ్రావణమాసంలో మాంసం ఎందుకు తినకూడదో.. శాస్త్రీయ కారణం చెప్పిన నిపుణులు..!
TeluguStop.com
శ్రావణమాసం( Sravanamasam ) శుభ ముహూర్తాల కలయిక అని చాలామందికి తెలుసు.ఈ మాసంలో మహిళలందరూ భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.
నామాలతో పాటు నియమ నిబంధనలతో పూజలు నిర్వహిస్తూ ఉంటారు.శ్రావణమాసం ముగిసే వరకు మాంసాహారానికి దూరంగా ఉంటారు.
దీనికి కారణాలు ఏమిటి? ఈ నెలాఖరు వరకు మాంసాహారాన్ని ముట్టుకోకపోవడానికి శాస్త్రీయమైన ( Scientifically )కారణాలు ఏమైనా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణమాసంలో నిశ్చితార్థాలు, వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు,ఉపనయనం, ఆక్రాభ్యాసం, అన్నప్రాసన, వ్యాపార మరియు పరిశ్రమల ప్రారంభం, దేవత విగ్రహాల ప్రతిష్టాపన మొదలైన ఇతర శుభకార్యాలు జరుగుతాయి.
"""/" /
సాధారణంగా శ్రావణమాసం వర్షాకాలంలో వస్తుంది.సగటున ఇది జూలై మధ్యలో మొదలవుతుంది.
అలాగే ఆగస్టు వరకు ఉంటుంది.కొన్నిసార్లు అదనపు నెల కూడా ఉంటుంది.
ఈసారి కూడా అదే పరిస్థితి ఏర్పడింది.ఒక నెల శ్రావణమాసం మరియు మరో నెల నిజమైన శ్రావణమాసం ఉంటుంది.
అయితే ఈ మాసంలో శాఖాహారనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.దీనికి వెనుక ఉన్న శాస్త్రీయ కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రావణమాసం వర్షాకాలంలో వస్తుంది.వర్షాకాలంలో కొన్ని రకాల ఆహారం పదార్థాలు తినకూడదు.
తర్వాత వరుసలో మాంసాహారం ఉంటుంది. """/" /
ఎందుకంటే హెపటైటిస్, కలరా, డెంగ్యూ( Dengue ) వంటి అనేక వ్యాధులు ఈ కాలంలోనే వ్యాప్తి చెందుతూ ఉంటాయి.
నీరు నిలిచిపోవడం పరిశుద్ధం లోపించడం వల్ల వ్యాధులు వ్యాపిస్తూ ఉంటాయి.జంతువులలో కూడా ఇలాంటి సమస్య తలెత్తవచ్చు.
వాటి ద్వారా మనుషులకు కూడా అంటూ వ్యాధులు సంక్రమిస్తాయని చెబుతారు.ఈ కాలంలో జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది.
అలాగే ప్రేగులలో బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుంది.దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
వాతావరణ మార్పులతో రోగనిరోధక శక్తి( Immunity ) బలహీనపడుతుంది.మరో కారణం ఏమిటంటే వర్షాకాలంలో చేపలు మరియు ఇతర జలచరులు సంతాన ఉత్పత్తి చేస్తాయి.
ఈ ప్రక్రియలో జలచరాలు కొన్ని వ్యర్ధాలను నీటిలో విడుదల చేస్తాయి.చేపలు వాటిని తింటాయి.
పైగా గర్భిణీగా ఉన్న జంతువులను చంపి తినడం సరికాదని చాలామంది ప్రజలు నమ్ముతారు.
అందుకే ఈ మాసంలో మాంసాహారానికి దూరంగా ఉంటారు.
ఒకే ఫ్రేమ్ లో టాలీవుడ్ సూపర్ స్టార్స్.. ఈ ఫోటో ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ అంటూ?