ఉత్తరం దిక్కున తల పెట్టి ఎందుకు నిద్రించకూడదు?
TeluguStop.com
మన సంప్రదాయంలో ఎన్నో నమ్మకాలు ఉంటాయి. కానీ వాటిని కొందరు మూఢనమ్మకాలు అని కొట్టిపారేస్తారు.
వాటితో ఏలాంటి ప్రయోజనం ఉండదని అంటారు. కానీ మన నానమ్మలు, అమ్మమ్మలు చెప్పిన చాలా వాటికిన గూడార్థం ఉంటుంది.
ప్రతి నమ్మకం వెనక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది. ముఖ్యంగా సైన్స్ ఉంటుంది.
వాటిని తార్కికంగా ఆలోచించి, శోధిస్తేనే వాటి అసలు అర్థం ఏమిటో తెలుసుకోవచ్చు.ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రించడం వాస్తు దోషమని మన పూర్వీకులు చెబుతుంటారు.
ఇలా ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని శాస్త్రాలే కాదు సైన్స్ కూడా చెబుతోంది.
మరి అలా చెప్పడం వెనక కారణాలు ఏమై ఉంటాయి.భూమిలో అయస్కాంత క్షేత్రం ఉత్తర, దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది.
మనిషిలోనూ అయస్కాంత క్షేత్రం ఉంటుంది. తల వైపు ఉత్తర దిశ క్షేత్రం, కాళ్ల వైపు దక్షిణ దిశ క్షేత్రం ఉంటుందట.
అందుకే తలను ఉత్తరం వైపు పెడితే. ఉత్తర ధృవాలు రెండు ఒకే వైపు ఉన్నట్టు అవుతుంది.
సజాతి ధృవాలు వికర్షించుకున్నట్టు అవుతుంది. దాని వల్ల శరీరంలో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
మన శరీరంలో అత్యంత విలువైన శక్తి వంతమైన మెదడు. ఆ ఉత్తర దిశలో ఉన్న ఆయస్కాంత శక్తి ప్రభావంతో మెదడులో ఉన్న కోబాల్ట్ నికిల్ ఐరన్ కణాలను ఆకర్షించడం వలన మెదడులో ఉన్న ప్రభావంతమైన శక్తిని కోల్పోవడం జరిగి తరచూ పీడకలలు రావడం, అర్ధరాత్రి మేలకువ రావడం, సరిగ్గా నిద్ర పట్టక పోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఏనుగు డ్యాన్స్ వీడియో వైరల్.. నిజమా లేక ఫేకా.. అసలు విషయం తెలిస్తే షాక్!