ఆషాఢమాసంలో పెళ్లయిన కొత్త జంట ఎందుకు దూరంగా ఉంటారో తెలుసా?
TeluguStop.com
మన తెలుగు మాసాలలో ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది.పన్నెండు మాసాలలో ఒక్కో మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది.
ఈ క్రమంలోనే నాలుగవ మాసమైన ఆషాడ మాసానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది.
ఆషాడ మాసాన్ని శూన్య మాసం అని కూడా పిలుస్తారు.ఆషాడ మాసంలో ఎలాంటి శుభకార్యాలు నిర్వహించరు.
అయితే ఈ మాసం ఎన్నో పూజలు వ్రతాలకు కూడా ప్రత్యేకం.అదేవిధంగా కొత్తగా పెళ్లి అయిన జంటలు ఈ ఆషాడమాసంలో అత్తవారింటి నుంచి పుట్టింటికి చేరుకుంటారు.
అసలు ఆషాడంలో కొత్తగా పెళ్లైన వధూవరులు ఎందుకు దూరంగా ఉంటారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఈ ఏడాది ఆషాడమాసం జూలై 9 వ తేదీన ప్రారంభమైంది ఆషాడం ఆగస్టు 8వ తేదీ వరకు ఉంటుంది.
ఈ క్రమంలోని ఈ నెల రోజులు పెళ్లైన వారు అత్తవారి ఇంటిలో ఉండకుండా పుట్టింటికి వెళ్తారు.
ఈ విధంగా కొత్త జంట ఒకరిని విడిచి ఒకరు ఉండాలని కఠిన నిబంధనలను ఈ నెల మొత్తం పాటిస్తారు.
సాధారణంగా ఆషాడమాసంలో ఎక్కువగా వ్యవసాయ పనులు ఉంటాయి.ఈ వ్యవసాయ పనులలో ఉండగా కొత్త అల్లుడు ఇంటికి వస్తే వారికి మర్యాదలు చేయడం కుదరదు కనుక పూర్వ కాలంలో పెద్దలు ఆషాఢమాసంలో కొత్తగా పెళ్లైన జంట దూరంగా ఉండాలని చెప్పేవారు.
"""/" /
అదేవిధంగా ఆషాడమాసంలో గర్భధారణ జరగడం అంత మంచిది కాదు.ఈ ఆషాడమాసంలో గాలులు కలుషితమైన నీరు ఎక్కువగా ఉంటాయి కనుక వీటిని తీసుకుంటే ఎన్నో అనారోగ్యాల బారిన పడతారు.
అందుకోసమే పెళ్లైన జంటను దూరంగా ఉంచుతారు.ఒకవేళ మహిళ గర్భం దాల్చితే వచ్చే ఏడాది చైత్రమాసంలో ఒక బిడ్డకు జన్మనిస్తుంది.
చైత్రమాసంలో విపరీతమైన ఎండలు ఉండటం వల్ల పుట్టే బిడ్డకు ఇది మంచిది కాదని భావిస్తారు.
అందుకోసమే ఆషాడమాసంలో ముఖ్యంగా కొత్తగా పెళ్లయిన జంటను దూరంగా ఉంచుతారు.ఈ నెల రోజులు మొత్తం వియోగం పాటిస్తే వారు మరి గర్భందాల్చిన ప్రసవం అవ్వడానికి జూలై ఆగస్ట్ అవుతుంది కనుక ఇది ఎంతో అనువైన కాలం అని చెప్పవచ్చు.
ఈ కారణం చేతనే పెళ్లైన జంటను దూరంగా పెడతారని పెద్దలు చెబుతుంటారు.
అనిల్ రావిపూడి కెరియర్ లో సంక్రాంతికి వస్తున్నాం బిగ్గెస్ట్ హిట్ గా మారబోతుందా..?