ఇండియాలో నెట్ ఫ్లిక్స్ మళ్లీ సత్తా చాటేనా?

కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లు తమ హవాను కోల్పోయాయి.కరోనా మూలంగా ప్రపంచ వ్యాప్తంగా సినిమా పరిశ్రమ అల్లకల్లోలం అయ్యింది.

ఈ నేపథ్యంలో జనాలు ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు.ప్రస్తుతం ఓటీటీ వేదిక మీద పలు సినిమాలతో పాటు సూపర్ కంటెట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఓటీటీల్లోనే అన్ని అంతగా రాణించడం లేదు.కొన్ని మాత్రమే దూసుకెళ్తున్నాయి.

ఇండియాలో అమెజాన్, హాట్ స్టార్ దుమ్మురేపుతున్నాయి.అయితే వరల్డ్ వైడ్ గా సత్తా చాటుతున్న నెట్ ఫ్లిక్స్ మాత్రం ఇండియాలో అంతగా ప్రభావం చూపించడం లేదు.

కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.2018లో నెట్ ఫ్లిక్స్ ఓటీటీకి 10 కోట్ల మంది సబ్ స్ర్కైబర్లు ఉన్నారని ఆ సంస్థ సీఈవో హేస్టింగ్స్ వెల్లడించాడు.

అయితే గడిచిన మూడు సంవత్సరాలుగా అంతగా ప్రభావాన్ని చూపించలేకపోతుంది.ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట నెట్ ఫ్లిక్స్ మంచి ప్రభావాన్ని చూపిస్తున్నా.

భారత్ లో మాత్రం వెననబడినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని మళ్లీ ఆ సంస్థ సీఈవోనే వెల్లడించాడు.

భారత్ లో 2 మిలియన్ డాలర్ల స్ట్రీమింగ్ మార్కెట్ తయారైందని మీడియా పార్ట్ నర్స్ ఆసియా వెల్లడించింది.

కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు. """/"/ ప్రస్తుతం ఓటీటీ లెక్కల ప్రకారం భారత్ లో హాట్ స్టార్ కు 4.

6 కోట్ల సబ్ స్క్రైబర్లు ఉన్నారు.అటు అమెజాన్ ప్రైమ్ కు 1.

9 కోట్ల మంది ఉన్నారు.నెట్ ఫ్లిక్స్ కు మాత్రం కేవలం 55 లక్షల మంది సబ్ స్ర్కైబర్లు మాత్రమే ఉన్నారు.

వాస్తవానికి 2018లో ఇండియాలో మొదలైన నెట్ ఫ్లిక్స్ ఆ తర్వాత హిందీ సినిమాలతో మంచి ప్రభావం చూపించింది.

కానీ ప్రస్తుతం టీవీల ద్వారానే జనాలు ఎక్కువగా ఎంటర్ టైన్మెంట్ అందుకుంటున్నారు.ఎక్కువ డబ్బులు పెట్టి ఓటీటీలను సబ్ స్ర్కైబ్ చేసుకునేందుకు ఇష్టపడ్డం లేదు.

"""/"/ అయితే నెట్ ప్లిక్స్ ఇప్పటికీ మిగతా ఛానెళ్ల కంటే ఎక్కువ ఖర్చుతో సినిమాలను అందిస్తోంది.

దీంతో వినియోగదారులు తక్కువ ధరకు లభించే వాటిపై మొగ్గు చూపుతున్నారు.దీంతో నెట్ ఫ్లిక్స్ వెనుకబడింది.

దీంతో మళ్లీ సత్తా చాటేందుకు టాటా గ్రూప్ తో జత కట్టింది.ప్రస్తుతం టాటా స్కై టాటా ప్లేగా మారింది.

ఈ డిష్ తీసుకుంటే నెట్ ఫ్లిక్స్ ఫ్రీగా అందిస్తుంది.దీంతో మళ్లీ నెట్ ఫ్లిక్ హవా కొనసాగే అవకాశం ఉంది.

పుష్ప 2 లో గంగళమ్మ జాతర లో ఫైట్ లో చనిపోయేది ఎవరో తెలుసా..?