Allu Arjun Nayanthara :బన్నీ బ్లాక్‌బస్టర్ హిట్ సినిమాని నయనతార ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలిస్తే..! 

మూవీ ఇండస్ట్రీలో దాదాపు అందరూ టాప్ హీరోలు, హీరోయిన్లు కలిసి సినిమాలు చేస్తారు.

కానీ ఒక్కోసారి ఇద్దరూ అగ్ర తారలుగా కొనసాగుతున్నా వారు కలిసి ఎలాంటి సినిమా చేయకుండానే ఇండస్ట్రీ నుంచి రిటైర్ అయిపోతారు.

వారిద్దరి కాంబోలో ఒక్క సినిమా అయినా వస్తే బాగుంటుందని అభిమానులు అనుకుంటూ ఉంటారు.

అలాంటి డ్రీమ్ కాంబినేషన్స్‌లో అల్లు అర్జున్, నయనతార( Allu Arjun, Nayanthara ) కాంబో ఒకటి.

"""/" / సౌత్ ఇండియన్ సినిమాలో వీరు పెద్ద స్టార్స్ అయినప్పటికీ, వారు ఇప్పటివరకు ఒక్క సినిమా ప్రాజెక్ట్‌లోనూ కలవలేదు.

అయితే, అల్లు అర్జున్ నయనతారకు SIIMA అవార్డ్స్‌లో అవార్డును అందించడం వంటి సందర్భాలలో వారు ఇంటరాక్ట్ అయ్యారు.

నిజానికి వీరిద్దరి కాంబోలో ఒక సినిమా రావాల్సి ఉంది.ఆ సినిమా మరేదో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన "దువ్వాడ జగన్నాథం( Duvvada Jagannadham )".

ఈ సినిమాలో అల్లు అర్జున్ విభిన్నమైన పాత్రలో నటించి బాగా అలరించాడు.హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ రోల్ చేసింది.

నిజానికి హీరోయిన్ రోల్ మొదటగా పూజకి ఇవ్వాలని హరిశంకర్ అనుకోలేదు.ఈ పాత్ర కోసం తొలుత లేడీ సూపర్ నయనతారను కాంటాక్ట్ అయ్యాడు.

"""/" / ఆమెను కలిసిన తర్వాత దువ్వాడ జగన్నాథం సినిమా కథని చాలా ఓపికగా చెప్పాడట.

అయితే నయనతార ఆ కథ తనకు సెట్ కాదని, కథ బాగున్నా తాను ఆ పాత్ర చేయలేనని నిర్మొహమాటంగా చెప్పిందట.

దాంతో ఆమె నిర్ణయాన్ని హరీష్ గౌరవిస్తూ సైలెంట్ గా తిరిగి వచ్చేసాడట.బాగా ఆలోచించి చివరికి ఈ పాత్రకు పూజా హెగ్డే( Pooja Hegde ) సెట్ అవుతుందని భావించి ఆమెనే సెలెక్ట్ చేసుకున్నాడు.

పూజ ఈ సినిమాలో తన రోల్ కు 100% న్యాయం చేసింది.చక్కగా డ్యాన్సులు కూడా వేసి కుర్ర కారుకు చెమటలు పట్టించింది.

ఈ సినిమాతోనే పూజా తెలుగులో ఒక అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది.ఆ విధంగా నయనతార తెలుగులో ఒక హిట్ కోల్పోయింది.

నిజానికి ఈ పాత్రను ఆమె చేసి ఉండలేకపోవచ్చు.ఏది ఏమైనా నయనతార కి ఈ సినిమా పోవడం వల్ల కెరీర్ కి పెద్దగా నష్టం జరగలేదు.

బిగ్ బాస్ సీజన్8 అట్టర్ ఫ్లాప్ కావడానికి కారణాలివేనా.. తెర వెనుక ఇంత జరిగిందా?