ఎంతో ట్యాలెంట్ ఉన్న నారా రోహిత్ ఎందుకు స్టార్ హీరో అవ్వలేకపోయాడు ?

నారా రోహిత్.( Nara Rohith ) 15 ఏళ్ల క్రితం బాణం అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

నటించిన మొదటి సినిమాతోనే మంచి హీరోగా గుర్తింపు అయితే దక్కించుకున్నాడు కానీ ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ ఆ స్థాయి సినిమా తీయలేకపోతున్నాడు.

అందుకు అనేక కారణాలు ఉన్నాయి.ఈ 15 నెలలో 16 నుంచి 17 సినిమాల్లో హీరోగా నటించాడు.

కొన్ని సినిమాల్లో క్యామియో అప్పియరెన్స్ కూడా ఇచ్చాడు.అయితే ఈ సినిమాలేవి కూడా రోహిత్ కెరియర్ కి ఉపయోగపడలేదు అని చెప్పాల్సిందే.

ఇప్పుడు తాజాగా ప్రతినిధి 2( Prathinidhi 2 ) అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

"""/" / ఆ సినిమా ఎలా ఉంది దాని రివ్యూ ఏంటి అనే విషయాల జోలికి అయితే ఈ ఆర్టికల్లో వెళ్లడం లేదు కానీ ఎంతో టాలెంట్ ఉన్న నారా రోహిత్ లాంటి హీరో ఎందుకు స్టార్ హీరో ( Star Hero ) అవలేక పోయాడు అనే విషయంపై ఎన్నోసార్లు సోషల్ మీడియాలో చర్చ సాగుతూనే ఉంది.

పైగా బోలెడంత బ్యాగ్రౌండ్ కూడా ఉంది.ఆయన తలుచుకుంటే ఎంత బడ్జెట్ అయినా కూడా పెట్టగలిగే ప్రొడ్యూసర్స్ ఉన్నారు.

మరి రోహిత్ కెరియర్( Nara Rohith Career ) ఎందుకు ఇలా నత్త నడక సాగుతుంది అంటే అందులో అందరికన్నా కూడా నారా రోహిత్ మిస్టేక్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఎందుకంటే ఒక సినిమా తీయాలి అంటే దానికి కావలసిన స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడానికి నార రోహిత్ చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నాడు.

మంచి కథ రావాలని ఏళ్లకు ఏళ్లు ఖాళీగా ఉంటే కొత్తవాళ్లు ఎంతో మంది వస్తున్నారు.

"""/" / ఎవరు పాత హీరోలను గుర్తు పెట్టుకుంటారు చెప్పండి.ఈ తప్పు వల్లే నారా రోహిత్ ఎక్కువగా సినిమాలు చేయలేకపోతున్నాడు.

2018లో ఆయన చివరి సినిమా విడుదల ఇప్పుడు ప్రతినిధితో మరుమరు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దీని తర్వాత సుందరాకాండ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు అయితే స్క్రిప్ట్ సెలక్షన్ చాలా వేగంగా చేయగలిగితే తప్ప రోహిత్ అంతే వేగంగా సినిమాలు చేయలేడు.

అందులో ఏ ఒకటో రెండో విజయం సాధించిన మళ్లీ ఫామ్ లోకి వస్తాడు.

మరి చూడాలి ఇకపై నారా రోహిత్ తన సినిమా వేగాన్ని పెంచుతాడా లేదా ఇలాగే నత్త నడక సాగుతాడా అనే విషయం మరి కొన్ని రోజులు ఆగితే తెలుస్తుంది.

కుంభమేళాలో ఘోరం.. ప్రశ్నించినందుకు యూట్యూబర్‌ని చితక్కొట్టిన సాధువు.. వీడియో లీక్!